Shiva Nirvana to direct Vijay Deverakonda: మజిలి మూవీ ఫేమ్ డైరక్టర్ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు గత సంవత్సరం నుండి వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ ఇద్దరూ వారు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌లు అయిపోయిన తరువాత వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ చిత్రం ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌‌తో తెరకెక్కబోతుందని, విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో మేజర్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో కూడా మజిలి ( Majili movie ) లాంటి పరిణతి చెందిన ప్రేమకథ ఉండబోతోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. Also read : Tamannaah's remuneration: నితిన్ సినిమా కోసం తమన్నా పారితోషికం


Vijay Deverakonda ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో 'ఫైటర్' అనే చిత్రం చేస్తున్న ( Fighter movie ) సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో మాత్రమేకాకుండా ఇండియాలోని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఫైటర్‌ మూవీలో విజయ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.   


అనన్య పాండే ( Actress Ananya Pandey ) అంటే గుర్తుకొస్తోంది.. ఇటీవల ఈ హీరోయిన్ హిందీలో నటించిన ఖాళీ పీలీ అనే చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కి ( Khaali peeli trailer ) సైతం ఆలియా భట్ నటించిన సడక్ 2 మూవీ ట్రైలర్ తరహాలోనే భారీగా డిజ్‌లైక్స్ వచ్చిపడ్డాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి ( Sushant Singh Rajput death ) తర్వాత బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు నటిస్తున్న చిత్రాలకు సుశాంత్ అభిమానుల నుంచి నెపోటిజం సెగ తగులుతోందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 


విజయ్ దేవరకొండతో కలిసి అనన్య పాండే నటిస్తున్న ఫైటర్ మూవీ హిందీలోనూ విడుదల కానున్న నేపథ్యంలో ఆమె చిత్రాలకు వస్తున్న వ్యతిరేకత ప్రస్తుతం ఫైటర్ చిత్ర నిర్మాతలను సైతం ఆలోచనలో పడేసిందట. అందులోనూ ఈ సినిమాను హిందీలో ప్రజెంట్ చేసేది ఇంకెవరో కాదు.. నెపోటిజం ( Nepotism ) ఆరోపణలతో సుశాంత్ అభిమానుల చేతిలో ఎక్కువ టార్గెట్ అవుతోన్న కరణ్ జోహర్ కావడం మరో ఇబ్బందికరమైన పరిణామం కానుందా అనే టాక్ కూడా వినిపిస్తోంది. Also read : Singeetam Srinivasa Rao: ప్రభాస్ సినిమాను గైడ్ చేయనున్న సింగీతం శ్రీనివాస రావు