Samantha Upcoming Movies: 2017-18 సమయంలో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. కానీ 2018 లో విడుదలైన విజయ్ దేవరకొండ ఆఖరి సినిమా టాక్సీవాలా. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ అంటూ మూడు సినిమాలతో వరుస డిజాస్టర్లు అందుకున్నారు. గత ఐదేళ్లలో విజయ్ దేవరకొండ కెరియర్ చూసుకుంటే అన్నీ ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. కానీ అందులో ఎంతో కొంత ఉరటనిచ్చిన సినిమా ఖుషి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంతా హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. వరుసగా ఫ్లాప్ లు అందుకుంటున్న విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక మంచి విజయాన్ని నమోదుచేసింది ఈ చిత్రం. కానీ ఫామిలీ స్టార్ సినిమాతో మళ్ళీ విజయ్ దేవరకొండ మరొక డిజాస్టర్ అందుకున్నారు. ఇక ఈసారి ఎలాగైనా మళ్ళీ హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సమంత సెంటిమెంట్ మరొకసారి వాడాలని విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..


వివరాల్లోకి వెళితే విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా చేస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్ పాత్ర కోసం సమంతను సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఒక రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత.. పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించనుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ సరసన రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది. మరి మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా కోసం కూడా అలాంటి పాత్ర చేయడానికి సమంతా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచిచూడాలి. 


మరోవైపు సమంత ఈ మధ్యనే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను మొదలుపెట్టింది. తాజాగా తన సొంత నిర్మాణ సంస్థతోనే మా ఇంటి బంగారం అనే ఒక సినిమాని ప్రకటించింది. సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తోనే ఇంప్రెస్ చేసిన సమంత ఈ సినిమాతో హిట్ అందుకునేలాగే ఉంది. ఈ సినిమా హిట్ అయితే హీరోయిన్ గా మాత్రమే కాక.. నిర్మాతగా కూడా సమంత మంచి విజయాన్ని అందుకున్నట్టే.


Read more: Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..


Read more: Lady doctor with 2 men: మరో ఇద్దరితో రాసలీలలు.. హోటల్ గదిలో భర్తకు అడ్డంగా దొరికి పోయిన లేడీ డాక్టర్ .. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter