`నోటా`లో రాజకీయ నేతలకు వ్యతిరేకంగా సీన్స్: విజయ్ దేవరకొండ
`నోటా`లో రాజకీయ నేతలకు వ్యతిరేకంగా సీన్స్: విజయ్ దేవరకొండ
నోటా సినిమాలో కొంతమంది రాజకీయ నేతలకు వ్యతిరేకంగా సన్నివేశాలున్నాయని ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ స్పష్టంచేశాడు. ఆ సన్నివేశాలు చూసి ఒకవేళ ఎవరైనా ఆవేదనకు గురయ్యారంటే, అది వాళ్ల భుజాలు వాళ్లు తడుముకోవడమే అవుతుంది. ఈ సినిమా చూశాకా కొంతమంది రాజకీయ నేతలకు సైతం నిద్ర కరువవుద్దని విజయ్ దేవరకొండ తెలిపాడు. నోటా సినిమా విడుదల సమీపిస్తున్న తరుణంలో తాజాగా ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను నటించిన చివరి చిత్రం గీత గోవిందం సూపర్ హిట్ అవడంతో ఫుల్ జోష్ మీద ఉన్న విజయ్ దేవరకొండ నోటా సినిమా సైతం తనకు మంచి ఫలితాన్నే అందిస్తుందని ఆశిస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఓ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.