Salaar Box Office Records సలార్ సినిమా మీద ఇప్పటికే ఆకాశన్నంటే అంచనాలున్నాయి. సలార్ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వచ్చినా, వాయిదా పడుతూనే ఉన్నా కూడా జనాలు మాత్రం ఇంకా అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇది వరకే సలార్ నుంచి చిన్న పాటి టీజర్ వస్తుందని చెవులు ఊదరగొట్టేశారు. కానీ ఇంత వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్లు రాలేదు. పోస్టర్లను మాత్రం అప్పుడప్పుడు స్పెషల్ అకేషన్‌లకు రిలీజ్ చేస్తూ వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సలార్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ మూవీని నిర్మిస్తోన్న హోంబళే సంస్థ అధినేత నిర్మాత విజయ్ తన బర్త్ డే సందర్భంగా కొన్ని కామెంట్లు చేశాడు. సలార్, కేజీయఫ్‌ల మీద స్పందించాడు. ఈ చిత్రాలకు ఫ్రాంచైజీలను చేస్తూనే వెళ్దామని అనుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఒకసారి సలార్ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఆలోచిస్తామని చెప్పుకొచ్చాడు.


అయితే ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ పూర్తయిందని, ఇంకా మిగిలిన షూటింగ్ జనవరిలో కంప్లీట్ చేస్తామని నిర్మాత తెలిపాడు. ఓ ఆరునెలలు పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్ పనులకే కేటాయిస్తామని అన్నాడు. ఇది పక్కా యాక్షన్ చిత్రమేనని చెప్పుకొచ్చాడు. అయితే సలార్ బాక్సాఫీస్ రికార్డుల మీద నిర్మాత స్పందించాడు.


సలార్ సినిమా రిలీజ్ అయితే మేం తీసిన చిత్రాల రికార్డులన్నింటిని బద్దలు కొట్టేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు కొన్ని రషెస్ చూశానని, అదిరిపోయాయని చెప్పుకొచ్చాడు. మరి సలార్ పార్ట్ 2, పార్ట్ 3లు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభాస్ ఈ సినిమాను త్వరగా పూర్తి చేస్తే.. ఆ తరువాత ప్రాజెక్ట్ కే పని పడతాడు. ఆ తరువాత మారుతి సినిమా కూడా లైన్‌లో ఉందన్న సంగతి తెలిసిందే. వీటన్నంటి తరువాత సందీప్ రెడ్డి స్పిరిట్‌ను మొదలుపెడతాడేమో చూడాలి.


Also Read : Ananya Pandey Latest Pics : నోరెళ్లబెట్టేలా చేసిన లైగర్ పోరీ.. అనన్య పాండే ఒంపుసొంపులు వైరల్.. డ్రెస్ ఉందా? లేదా?


Also Read : Pawan Kalyan Nandamuri Balakrishna : వీర సింహారెడ్డి సెట్‌లో పవన్ కళ్యాణ్‌.. బాలయ్యతో పవర్ స్టార్ ముచ్చట్లు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook