విజయ్ సేతుపతి.. (Vijay Sethupathi) తమిళ ఇండస్ట్రీలో (Kollywood) మంచి నటనతో ఆకట్టుకుంటున్న నటుడు, తెలుగులో "సైరా నరసింహ రెడ్డి" (Saira Narasimha Reddy), "ఉప్పెన" (Uppena) వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్నన పొందాడు. తెలుగులో డబ్ చేసిన మాస్టర్ (Master) సినిమాలో కూడా విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసిన విజయ్ సేతుపతి ఉప్పెన ఫేం కృతిశెట్టి (Uppena Fame Kritishetty) పై సంచనల కామెంట్స్ చేసాడు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృతిశెట్టి-వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej) జంటగా నటించిన ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి తండ్రిగా నటించిన విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పూర్తిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా "లాభం" (Labham) సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 


Also Read: Walking with Lizard: పిల్ల డైనోసార్ తో వాకింగ్.. వైరల్ అవుతున్న వీడియో!


తెలుగులో ఉప్పెన సినిమాలో బేబమ్మ (కృతిశెట్టి) (Bebamma) తండ్రి పాత్రలో నటించాను. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న తరువాత తమిళంలో ఒక సినిమా కి ఓకే చెప్పను. అందులో హీరోయిన్ గా కృతిశెట్టి బాగుంటుందని సినిమా యూనిట్ భావించింది. ఆమె ఫోటోను నాకు పంపిన వెంటనే... నేను మా యూనిట్ కి ఫోన్ చేసి" ఇటీవలే విడుదలైన తెలుగు సినిమాలో ఆమెకు నేను తండ్రిగా నటించాను. ఈ సినిమాలో ఆమెతో నేను రోమాన్స్ చేయలేను కావున హీరోయిన్ గా ఈమె వద్దని చెప్పాను" అని విజయ్ సేతుపతి వెల్లడించారు. 


ఉప్పెన (Uppena Movie) సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో మా ఇద్దరి మధ్య జరిగే సన్నివేశంలో కృతిశెట్టి కంగారు పడి.. ఇబ్బంది పడటం నేను గమనించాను. అపుడు తనతో " నాకు నీ అంత వయసు కొడుకు ఉన్నాడు... నువ్వు కూడా నా కూతురుతో సమానం.. ఏం భయం లేకుండా చేయు" అని ప్రోత్సహించాను. కూతురిలా భావించే ఆమెతో రోమాన్స్ చేయటం నా వల్ల కాదని విజయ్ సేతుపతి తెలిపారు. 


Also Read: Vaccine Originality: కరోనా వ్యాక్సిన్ అసలైనదా, నకిలీదా అనేది ఎలా గుర్తించడం


ఇక విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'లాభం' (Labham) సినిమా విషయానికి వస్తే, రైతులు ఎదుట్కొంటున్న సమస్యలు, దళారుల వ్యవస్థ పై ఈ సినిమా రుపొండుతుందని తెలుస్తుంది. SP జననాథన్‌ దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తుండగా...  ఇమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook