Walking with Lizard: పిల్ల డైనోసార్ తో వాకింగ్.. వైరల్ అవుతున్న వీడియో!

పెంపుడు జంతువులతో వాకింగ్ వెళ్లటం సాధారణమే.. కానీ ఒక వ్యక్తి పెంపుడు జంతువుతో వాకింగ్ వెళ్లిన వీడియో పోస్ట్ చేస్తే "పిల్ల డైనోసార్" అంటున్న నెటిజన్లు.. ఆ కథేంటో చూడండి మరీ!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 11:47 AM IST
  • అమెరికాలో తొండతో పార్కులో వాకింగ్ కి వచ్చిన వ్యక్తి
  • నోరు తెరచి ఆహరం అడుగుతున్న తొండ
  • పిల్ల డైనోసార్ అని పిలుస్తున్న నెటిజన్లు
Walking with Lizard: పిల్ల డైనోసార్ తో వాకింగ్.. వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: ఒక వ్యక్తి  తన పెంపుడు జంతువుతో వాకింగ్ కి వెళ్ళాడు. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... వీడియో చూసిన నెటిజన్లు దానిని "పిల్ల డైనోసార్" (Dinosaur ) అంటున్నారు. డైనోసార్ తో వాకింగ్ ఏంటి అనుకుంటున్నారా? పదండి అదేంటో చూసేద్దాం మరీ!

మాములుగా జంతు ప్రేమికులు పిల్లి, లేదా కుక్క వంటి వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. వాటితో ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ కి వెళ్తుంటారు కదా.. కానీ, ఒక వ్యక్తి తొండను పెంచుకుంటున్నాడు. అవునండి నిజంగా ఇది నిజం.. 

Also Read: Vaccine Originality: కరోనా వ్యాక్సిన్ అసలైనదా, నకిలీదా అనేది ఎలా గుర్తించడం

అమెరికా ఫ్లోరిడాలో (America) ఉంటున్న ఒకతను మాత్రం తొండతో వాకింగ్ కి వచ్చాడు. అది  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు అంతే.. ఇంకేం ఉంది అది కాస్త వైరలైంది. ఎందుకంటే ఆ తొండ చూడటానికి డైనోసార్(Dinosaur) లా ఉండటమే కారణం. నిజానికి తొండను పెంపుడు జంతువుగా పెంచుకోవటం మరియు అది డైనోసార్ లా నోరు దాని చుట్టూ చర్మం ఉండటం వల్లే ఈ వీడియో తెగ వైరలవుతుంది. 

వాకింగ్ కు ఏ కుక్కనో లేక పిల్లినో తోడుగా చైన్ కట్టి తీసుకెల్తాం కదా.. కానీ ఈ వీడియోలో ఒక వ్యక్తి తొండకు తాడు కట్టి వాకింగ్ కి తీసుకొచ్చాడు. ఆ తొండ అతడి పెంపుడు జంతువు అంట మరియు వాకింగ్ కోసం దాన్ని పార్క్ కు తీసుకొచ్చాడంట. దాని మెడకు తాడు కట్టి తనతో పార్కులో తీసుకెళ్తున్నాడు. అది కాస్త ముందుగు వెళ్తూ.. మళ్లి ఆగి అతడి వైపు అతడి వైపు చూస్తూ... ఆహరం కోసం నోరు తెరుస్తుంది. 

Also Read: Shiva puja on Monday: శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా ? చంద్రుడి శాపం పోగొట్టిన శివుడి వరం ఏంటి ?

ఇలా దానికి ఆహరం పెడుతూ వాకింగ్ వెళ్తున్న వీడియోని తొండల సంరక్షకులు టామ్మీస్ రెప్టైల్స్ టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారుసోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరలైంది. కొంత మంది నోరులేని ఆ మూగ జీవాన్ని తాడు కట్టి హింసించటం నేరమని చెప్తుంటే.. మరి కొంత మంది ఏమో అది తొండా లేదా జురాసిక్ పార్క్ సినిమాలోని డైనోసారా (Dilophosaurus) అని తెగ కామెంట్లు పెడుతున్నారు. 

ఇక ఈ తొండ విషయానికి వస్తే... ఈ రకం తొందలను క్లామిడోసారస్ (Chlamydosaurus) లేదా ఫ్రిల్ల్‌డ్ డ్రాగన్ (Frilled Dragon) అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. డ్రాగన్ లాగా కనిపించే ఈ తొండలను ఎక్కువగా ఆస్ట్రేలియా, సౌత్ న్యూగినియాలో  కనిపిస్తాయి. ఇవి పూర్తిగా హానికరం కాని జంతువులు, ఇవి చెట్లపై జీవిస్తూ, పురుగులు కీటకాలను మరియు అప్పుడప్పుడు చెట్లను తిని బ్రతుకుతుంటాయి. 

 

Trending News