Vijayakanth - Padma Bhushan: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఈ సారి మెజారిటీ అవార్డులు దక్షిణాది వారికే దక్కాయి. అందులో వెంకయ్య నాయుడు, వైజయంతిమాల, చిరంజీవిలకు కేంద్రం పద్మ విభూషణ్ వంటి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాయి. అటు తమిళులు ఆరాధ్య నటుడు దివంగత కెప్టెన్ విజయకాంత్‌ను మరణం తర్వాత   కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించడం విశేషం. దీంతో విజయకాంత్ అభిమానులతో పాటు తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయకాంత్ విషయానికొస్తే.. తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులకు తన యాక్షన్ సినిమాలతో గట్టి పోటీ ఇచ్చారు విజయకాంత్. గతేడాది డిసెంబర్ 28న ఈయన కన్నుమూసారు.విజయకాంత్ కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా.. దర్శకుడిగా సత్తా చూపెట్టారు కెప్టెన్. తన కాంపిటీటర్స్ అయినా రజినీకాంత్, కమల్ హాసన్, అర్జున్ వంటి హీరోలు వేరే భాషల్లో నటించినా.. ఈయన మాత్రం మాతృ భాషపై ఉన్న గౌరవంతో కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే నటించారు. అంతేకాదు తన సూపర్ హిట్ చిత్రాల డబ్బింగులతో తెలుగు, హిందీల్లో కూడా తన కంటూ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నారు. 27 యేళ్ల వయసులో వెండితెరకు పరిచయమైన విజయకాంత్ ముందుగా ‘ఇనిక్కుమ్ ఇలమై’ సినిమాలో నటించారు. ఈ మూవీ 1979లో విడుదలైంది.


ఆ తర్వాత కెప్టెన్  వెనుదిరిగి చూసింది లేదు. ఫస్ట్ మూవీలోనే విలన్‌గా నటించి మెప్పించారు. అప్పటి నుంచి 2015 వరకు నిరాటంకంగా నటిస్తూనే ఉన్నారు. సినిమాల్ యాక్ట్ చేస్తూనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. డీఎండీకే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి కాకపోయినా.. తమిళనాడు ప్రతిపక్షనేత స్థాయికి ఎదిగారు. అసలు హీరోగా పనికిరాడనే కామెంట్స నుంచి యాక్షన్ హీరోగా తమిళ చిత్ర సీమలో తనదైన ముద్ర వేసారు విజయకాంత్. ఈయన కెరీర్‌లో కెప్టెన్, కెప్టెన్ ప్రభాకర్, సింధూర పువ్వు, పోలీస్ అధికారి, క్షత్రియుడు, రామానాయుడు, ఇండియన్ పోలీస్,  సిటీ పోలీస్, క్రోధం, రౌడీలకు రౌడీ, సెల్యూట్ వంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.


దాదాపు 150 చిత్రాల్లో నటించిన విజయకాంత్ 1984లో ఏకంగా ఈయన హీరోగా నటించిన 18 సినిమాలు విడుదల అయి సంచలన విజయం సాధించాయి. దాదాపు కెరీర్‌లో 20 పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించారు. నటుడిగా ఈయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్. ఈయనకు తమిళంలో పురుట్చి కళైంగర్ అనే బిరుదు వుంది. అంటే విప్లవ కథానాయకుడు అని అర్ధం. మొత్తంగా 1990లో ఆంధ్ర ప్రదేశ్‌ ను వరుదలు వచ్చినపుడు అప్పటి ముఖ్య మంత్రి మర్రి చెన్నారెడ్డికి రూ. లక్ష విరాళం అందజేసారు. ఈయన పలు చిత్రాలు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచాయి. ఠాగూర్, మా అన్నయ్య, ఖైదీ నంబర్ 150 వంటి చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. మొత్తంగా కెప్టెన్‌ చనిపోయిన తర్వాత కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈయన్ని పద్మ భూషణ్‌ వంటి అరుదైన గౌరవంతో సత్కరించడం విశేషం.


Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?


Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook