Vijayashanthi Fires on Rana Naidu: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన విజయశాంతి తర్వాత వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత రాజకీయ ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి లో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆమె ఒక పార్టీ పెట్టడం పార్టీని బిజెపిలో కలిపేయడం ఆ తర్వాత బిజెపి జాతీయ నాయకురాలుగా కొనసాగుతూ ఉండడం దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన నోట్ కూడా ఆమె షేర్ చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) OTT సిరీస్ పై ఈ స్పందన అని పేర్కొన్న ఆమె ఓటీటీ ప్లాట్ ఫామ్ కు కూడా సెన్సారింగ్ అవసరమే అని పేర్కొన్నారు. ఈ విషయం అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య  ముందుకు ఇప్పటికే తెస్తున్నారని ఆమె అన్నారు. ప్రజల మనోభావాల నుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోక, సంబంధిత నటులు, మరియు నిర్మాతలు ఓటీటీ నుండి నిరసించబడుతున్న పై ప్రసారాలని తొలగించి భవిష్యత్‌లో దేశవ్యాప్త ఓటీటీ ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తున్నానని అన్నారు.


తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నానని విజయశాంతి పేర్కొన్నారు. ఒక అమెరికన్ సిరీస్ ని ఇండియన్ నేటివిటీకి తగినట్లుగా అడాప్ట్ చేస్తూ ఈ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ రూపొందించారు. గతంలో మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన దర్శకుడే ఈ సినిమాని కూడా ఈ సిరీస్ ని కూడా డైరెక్ట్ చేశారు ఈ సిరీస్ లో వెంకటేష్ నాగ నాయుడు అనే పాత్రలో కనిపించగా సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి రానా రానా నాయుడు అనే పాత్రలో కనిపించారు.


రానా భార్య పాత్రలో సుర్వీన్ చావ్లా నటించింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ అసలు ఏమాత్రం కుటుంబ సమేతంగా కూర్చొని చూసే విధంగా లేదని ఇప్పటివరకు వివేకానందుడిగా తెలుగు సినీ పరిశ్రమ అందరూ భావించే వెంకటేష్ దారుణంగా ఈ సిరీస్ లో ఉన్నారని ఇలాంటి సిరీస్ ని పిల్లలు చూస్తే చెడిపోవడం ఖాయం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయశాంతి ఈ మేరకు స్పందించి ఉండవచ్చని అంటున్నారు.


Also Read:  Dasara story line Leaked: లవ్ స్టోరీనే కానీ అంతకు మించి.. షాకిస్తున్న లీకైన దసరా స్టోరీలైన్!


Also Read: 'Natu Natu': ఢిల్లీ చాందిని చౌక్ వ‌ద్ద నాటు నాటుకి స్టెప్పులేసిన‌ జ‌ర్మ‌న్ అంబాసిడర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook