Vijay's Beast second single Jolly O Gymkhana garners Released: తమిళ స్టార్ హీరో 'దళపతి' విజయ్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా వచ్చే నెలలో బీస్ట్‌ విడుదల కానుంది. విజయ్ చివరగా నటించిన మాస్టర్, బిగిల్ సినిమాలు ఘన విజయాలు అందుకోవడంతో.. బీస్ట్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దళపతి ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తునారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీస్ట్‌ సినిమాకు కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' సాంగ్ ఎంతటి సెన్సెషన్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా శ్రోతలను ఊర్రూతలూగించింది. ఇక సోషల్​ మీడియాలో రికార్డులు సృష్టించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజైన అరబిక్ కుతు సాంగ్ యూట్యూబ్‌లో 150 మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. 



తాజాగా బీస్ట్‌ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'జాలీ ఓ జింఖానా' అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌..  అరబిక్ కుతును మించేలా ఉంది. ఈ సాంగ్​ను హీరో విజయ్​ స్వయంగా ఆలపించారు. పాటలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌, డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కనిపించారు. సాంగ్‌లో విజయ్‌, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. దళపతి తనదైన స్టయిల్లో స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ పాటకు 10,854,178 వ్యూస్ వచ్చాయి. 


Also Read: RRR Movie Tickets: గ్యాస్ సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు! ఎక్కడో తెలుసా?!!


Also Read: Samantha Yashoda Movie: సమంత 'యశోద' సినిమాకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook