Chiranjeevi congratulates and host a party to Kamal Haasan: సౌత్ నుంచి నార్త్‌ వ‌ర‌కు ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన 'విక్ర‌మ్' హ‌వానే న‌డుస్తుంది. విక్ర‌మ్ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో.. క‌లెక్ష‌న్ల తుఫాన్ సృష్టిస్తుంది. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకి లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన విక్ర‌మ్ చిత్రం గ‌త శుక్ర‌వారం (జూన్‌ 3న) విడుద‌లై పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విక్ర‌మ్ సినిమా విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉ‍న్న కమల్‌ హాసన్.. ఈ మూవీ నటీనటులతో పాటు డైరెక్టర్‌, మూవీ బృందానికి బహుమతులు అందించారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి లోకనాయకుడిని సత్కరించారు. విక్రమ్‌ సినిమా మంచి విజయం అందుకున్న సందర్భంగా.. కమల్‌తో పాటు డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజును ఇంటికి ఆహ్వానించి చిరు  అభినందనలు తెలిపారు. అనంత‌రం ఇంట్లో వారికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు . ఈ పార్టీకి బాలీవుడ్ కండల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కూడా వచ్చి కమల్‌కి అభినందలు తెలిపారు.


విక్రమ్‌ టీంను సత్కరించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్‌ చేసి.. నా స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 'నా పాత స్నేహితుడిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు శనివారం రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. కమల్‌ హాసన్‌తో పాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్‌ మా ఇంటికి రావడం సంతోషంగా ఉంది. విక్రమ్ సినిమా అద్భుతంగా, థ్రిల్లింగ్‌గా ఉంది. అభినందనలు మిత్రమా' అని చిరు ట్వీటారు. 



విక్రమ్‌ చిత్రంలో తమిళ హీరో విజ‌య్ సేతుప‌తి, మలయాళ నటుడు ఫాహ‌ద్ ఫాజిల్ కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. ఇక తమిళ స్టార్ హీరో సూర్య కీల‌క‌ పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాకి అనిరుధ్ ర‌విచందర్‌ సంగీతం అందించారు. లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్ తన సొంత బ్యానర్‌లో ఈ చిత్రంను నిర్మించారు. 


Also Read: Samrat Prithvira Movie: అక్షయ్ కుమార్‌కు షాక్, ప్రేక్షకుల్లేక పృథ్వీరాజ్ సినిమా రద్దు


Also Read: SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక ప్లేయర్.. తొలి జట్టుగా లంక అరుదైన రికార్డు!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.