Samrat Prithvira Movie: అక్షయ్ కుమార్‌కు షాక్, ప్రేక్షకుల్లేక పృథ్వీరాజ్ సినిమా రద్దు

Samrat Prithvira Movie: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు షాక్ తగిలింది. ప్రేక్షకుల్నించి ఊహించని నిరాశ ఎదురైంది. ఫలితంగా సినిమా  ప్రదర్శనే రద్దైంది. అసలేమైంది..ఆ వివరాలు చూద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2022, 05:59 PM IST
Samrat Prithvira Movie: అక్షయ్ కుమార్‌కు షాక్, ప్రేక్షకుల్లేక పృథ్వీరాజ్ సినిమా రద్దు

Samrat Prithvira Movie: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు షాక్ తగిలింది. ప్రేక్షకుల్నించి ఊహించని నిరాశ ఎదురైంది. ఫలితంగా సినిమా  ప్రదర్శనే రద్దైంది. అసలేమైంది..ఆ వివరాలు చూద్దాం..

బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా నిలిచిపోయింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు కరువయ్యారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుంది చిత్ర యూనిట్. చక్రవర్తి పృధ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు పెద్దఎత్తున వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ జత చేశారు. ఏకంగా 3 వందల కోట్లు బడ్జెట్ కుమ్మరించారు. 

ఎన్నో అంచనాల మధ్య జూన్ 3వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలైన అక్షయ్ కుమార్ సినిమా సామ్రాట్ పృథ్వీరాజ్‌కు నిరాశే ఎదురైంది. విడుదలై వారం దాటినా కేవలం 55 కోట్లు మాత్రమే వసూలైంది. చాలా ప్రాంతాల్లో సినిమా చూసేందుకు కనీసం ఒక్కరు కూడా రాలేదని సమాచారం. ఫలితంగా ప్రదర్శనలు రద్దు చేశారు. ఇంకొన్ని థియేటర్లలో సగం సీట్లు కూడా నిండుకోకపోవడంతో షో ఆపేశారు. ఓవరాల్‌గా సినిమా ఫ్లాప్ కావడం, ప్రేక్షకులు లేకపోవడంతో సినిమా ప్రదర్శనలు నిలిపేసినట్టు తెలుస్తోంది. ప్రేక్షకులు లేక సినిమా రద్దు కావడమనేది బహుశా ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. బాలీవుడ్ అగ్ర నటుడిగా ఉన్న అక్షయ్ కుమార్‌కు ఇది నిజంగా ఊహించని పరిణామం.

Also read: Ante Sundaraniki: 'అంటే.. సుందరానికీ' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌పై మాదాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News