Vikram Telugu Trailer: పదా చూస్కుందాం.. సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరో! విక్రమ్ తెలుగు ట్రైలర్ అదుర్స్
Kamal Haasan`s Vikram movie Telugu Trailer out. విక్రమ్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లుక్స్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
Kamal Haasan starrer Vikram telugu Trailer launched by Ram Charan: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'విక్రమ్'. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ విక్రమ్ సినిమాని నిర్మించారు. విక్రమ్ సినిమా జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పెంచింది.
ప్రమోషన్స్‌లో భాగంగా విక్రమ్ చిత్ర మేకర్స్ ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా తెలుగు ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. 2 నిమిషాల 38 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్.. కమల్ హాసన్ వాయిస్ ఓవర్‌తో మొదలైంది. 'అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్నీ వేటకెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆ లోపు సూర్యాస్తమయం అయితే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ, ఎప్పుడు అని నిర్ణయించేది ప్రకృతి కాదు నేను' అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభయింది.
విక్రమ్ ట్రైలర్‌లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఎవరికీ వారి ప్రత్యేక నటనతో ఆకట్టుకున్నారు. ముగ్గురి లుక్స్, యాక్టింగ్ బాగున్నాయి. ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా యాక్షన్‌తో నిండిపోయింది. డైలాగ్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
విక్రమ్ సినిమాలో కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్ మరియు శివాని నారాయణన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా 'విక్రమ్'లో అతిథి పాత్రలో అలరించనున్నాడు. ఖైదీ, మాస్టర్ సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించడం.. ముగ్గురు హీరోల నటన.. సూర్య అతిథి పాత్రలో నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఆ అంచనాలు మరింత పెరిగాయి.
Also Read: iPhone 13 Offer: ఐఫోన్ 13పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఏకంగా 42 వేల రూపాయల తగ్గింపు!
Also Read: Arjun Tendulkar IPL Entry: ముంబై తుది జట్టులోకి అర్జున్ టెండూల్కర్.. ఢిల్లీపై మొదటి మ్యాచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook