Skanda Movie Mass Songs: ఎనర్జిటిక్ స్టార్ రామ్-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'స్కంద'(Skanda Movie). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై రాబోతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ జనాల్లో ఎనలేని హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు ఆడియెన్స్ ను ఓ ఊపు ఊపేశాయి. రామ్, శ్రీలీల డ్యాన్స్ తో ఇరగదీశారు. వినాయక చవితి సందర్బంగా ఓ ఊరమాస్‌ సాంగ్‌ ను రిలీజ్ చేశారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్‌ ఐటెం గర్ల్‌ ఊర్వశి రౌటెలా మెరిసింది. మరోసారి రామ్ తన ఎనర్జిటిక్‌ స్టెప్స్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ గీతాన్ని థమన్‌ స్వర పరచగా.. హేమచంద్ర, రమ్య బెహరా, మహా ఆలపించారు. అనంత్ శ్రీరామ్‌ లిరిక్స్‌  అందించాడు. ఈ మూవీకి నార్త్‌లో కూడా మంచి హైప్‌తో రిలీజవుతుంది. చివరి 30 నిమిషాల ఎపిసోడ్ స్కంద మూవీకి హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీకి సంబంధించిన థియాట్రికల్, నాన్ థియాట్రికల్ రైట్స్ భారీగానే అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ మూవీ సూపర్ హిట్ అయితే స్కంద 2 కూడా తీసే అవకాశం కూడా ఉంది. ఈ మూవీ రిలీజయ్యే రోజు చంద్రముఖి-2 కూడా విడుదలవుతుంది. 



Also Read: Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..


రామ్ అభిమానికి 'స్కంద' పేరు
రీసెంట్ గా స్కంద మూవీ పేరును రామ్ అభిమాని తన కొడుకుకు పెట్టుకున్నాడు. ఈ న్యూస్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. దీనిపై రామ్ కూడా స్పందించాడు. ''ఈ విషయం తన మనసును హత్తుకుందని..  ఆ కుటుంబానికి స్కంద దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని'' రామ్ ట్వీట్ చేశాడు. 


Also Read: Jawan Collections: వీకెండ్ లోనూ తగ్గని 'జవాన్' జోరు.. రూ. 800 కోట్ల క్లబ్ లో షారుఖ్ మూవీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook