Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..

Bigg Boss-7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 రెండో వారం ముగిసింది. ఇప్పటికే కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి వెళ్లగా.. సెకండ్ వీక్ షకీలా కూడా ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా సాగిందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2023, 12:14 PM IST
Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..

Bigg Boss-7 Telugu Second week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఎన్నో ట్విస్టులతో ఉంటుందనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది . డబుల్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ వంటి ట్విస్టులు ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దానికి భిన్నంగా బిగ్ బాస్ టీమ్ ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ వారం కూడా ఒక్కరినే మాత్రమే హౌస్ నుండి బయటకు పంంపించింది. ఓటింగ్ లో చివరి స్థానంలో నిలిచిన షకీల సెకండ్ వీక్ బిగ్‍బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. 

ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందంటే..
ముందుగా నామినేషన్లలో ఉన్న ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ, షకీల, రతిక రోజ్,  టేస్టీ తేజ, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‍కు బాక్సులు ఇచ్చారు కింగ్ నాగార్జున. ఈ బాక్సుల్లో హ్యాపీ స్మైలింగ్ ఫేస్ ఉంటే సేఫ్ అని.. యాంగ్రీ ఎమోజీ ఉంటే నాట్ సేఫ్ అని నాగార్జున తెలిపారు. ఇందులో ప్రిన్స్ యావర్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన ప్రక్రియలో రతిక్ సేఫ్ అయింది. 

ఎలిమినేషన్ ప్రకియలో భాగంగా.. శోభాశెట్టి, షకీల, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్‍, గౌతమ్ కృష్ణకు మరో గేమ్ పెట్టారు. ఇందులో హ్యాట్ ఇచ్చి దాన్ని కంటెస్టెంట్ పెట్టుకున్నప్పుడు గాడిద సౌండ్ వస్తే వారు నాట్ సేఫ్ అని, బుల్ (ఎద్దు) సౌండ్ వస్తే సేఫ్ అని నాగార్జున చెప్పారు. దీంతో శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ సేఫ్ అయ్యారు. గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, షకీల మధ్య జరిగిన గేమ్ లో గౌతమ్ సేఫ్ అయ్యాడు. 

చివరగా  ఎలిమినేషన్ ప్రక్రియ టేస్టీ తేజ, షకీల మధ్య జరిగింది. ఇందులో టేస్టీ తేజ సేఫ్ అవ్వగా.. షకీల ఎలిమినేట్ అయ్యారు.దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన రెండో కంటెస్టెంట్ గా షకీల నిలిచారు. షకీలా బిగ్‌ బాస్‌ నుంచి వెళ్తుండగా హౌస్ మేట్స్ అందరూ  భావోద్వేగానికి గురైయ్యారు. ఇప్పటికే పవర్ ఆస్త్రా సాధించిన వారిలో ఆట సందీప్, శివాజీ ఉన్నారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వచ్చే వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. 

Also Read: Peda Kapu 1: శ్రీకాంత్‌ అడ్డాల మూవీ నుంచి జాతర సాంగ్ వచ్చేసింది.. మీరు చూసేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News