Viraaji: ఆహా ఓటీటీలో ట్రెండింగ్ అవుతోన్న ‘విరాజి’ చిత్రం.. 56 లక్షలకు పైగా వాచ్ మినిట్స్ తో దూసుకుపోతున్న మూవీ..
Viraaji: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరాజి’. ఒక మంచి సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా ఓ రేంజ్ లో ఇరగదీస్తోంది.
Viraaji OTT Streaming: ‘విరాజి’ మూవీతో మంచి ప్రయత్నంతో ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు కథానాయకుడు వరుణ్ సందేశ్. ఈ సినిమాను మహా మూవీస్ తో కలిసి ఎం3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు. ఆద్యంత హర్ష దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ నెల 2న థియేటర్స్ లోకి వచ్చిన "విరాజి" సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ -
"విరాజి" చిత్రాన్ని ఈ నెల 2న థియేట్రికల్ గా విడుదల చేశాము. ఆ వారం చాలా సినిమాలు రిలీజ్ కావడం వల్ల మా సినిమా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. అందుకే ఈ చిత్రాన్నిత్వరలో ఓటీటీలోకి తీసుకొచ్చాము. ఆహాలో మా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మా విరాజి చిత్రం 56 లక్షల వాచ్ మినిట్స్ తో ఆహా యాప్ లో ట్రెండింగ్ లో ఉందన్నారు. "విరాజి" సినిమా విషయంలో హీరో వరుణ్ సందేశ్ ఎంతో సపోర్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావివంచారు. ఏమాత్రం ఆటిట్యూడ్ లేని పర్సన్ మా హీరో. మంచి చిత్రం అందించిన మా దర్శకుడికి ధన్యవాదాలు చెప్పారు.
నటుడు వైవా రాఘవ మాట్లాడుతూ -
"విరాజి" సినిమాను థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ కు మంచి ప్రశంసలు లభించాయి. ఆహాలో మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియన్స్ నకు ధన్యవాదాలు తెలిపారు.
నటుడు కాకినాడ నాని మాట్లాడుతూ -
"విరాజి" సినిమాలో మంచి పాత్ర చేసే ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ఆద్యంత్ హర్ష, నిర్మాత మహేంద్ర నాథ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం వరుణ్ సందేశ్ గారు ఎంతో కష్టపడిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు ప్రస్తుతం ఆహా లో ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణకు థాంక్స్ చెప్పారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..
"విరాజి" సినిమా ఆహా ఓటీటీలోకి మంచి రెస్పాన్స్ రావడం చూసి ఆనందంగా ఉంది. అంతేకాదు అక్కడ 56 లక్షల వాచ్ మినిట్స్ తో ట్రెండింగ్ లో ఉంది. చాలా ఆనందంగా ఉంది. నిర్మాత మహేంద్రనాథ్ మా మూవీని అభిరుచితో నిర్మించారు. అంతే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియెన్స్ చేరువయ్యేలా చేసారు. ఒక మంచి పాయింట్ తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష "విరాజి" సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. అయితే ఆగస్టు 2న థియేటర్స్ మేము అనుకున్నంత స్థాయిలో దొరకలేదు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహా ద్వారా అందరు చూస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణదేవి, కుషాలిని పులప, ప్రసాద్ బెహరా, తదితరులు.
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి