Virata Parvam movie gets OTT release date: రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'విరాట పర్వం'. టాలెంటెడ్ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంను డి సురేష్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో 1990ల్లో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విరాట పర్వం చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1990లో తెలంగాణలో జరిగిన నక్సలైట్ ఉద్యమం నేపథ్యం చుట్టూ విరాట పర్వం సినిమా కథ తిరుగుతుంది. ఉద్యమ సమయంలోనే వరంగల్ నగరానికి చెందిన అభ్యుదయ వాది సరళ ప్రాణాలు కోల్పోతుంది. ఆమె జీవితాన్ని, ఉద్యమాన్ని దర్శకుడు వేణు ఊడుగుల బాగా చూపించారు. రానా దగ్గుబాటి, సాయి పల్లవిల సహజ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొత్తంగా హిట్ టాక్ తెచ్చుకున్న విరాట పర్వం విజయవంతంగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుంది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.


విరాట పర్వం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. ఈ సినిమా జూలై 1 నుంచి  స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. విరాట పర్వం సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో జూలై 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విషయం తెలుసుకున్న ఫాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ఇక రూ.15 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 



విరాట పర్వం సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి వస్తుండడం విశేషం. ఓటీటీలో చూసేందుకు వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సినిమాలో కామ్రేడ్‌ రవన్నగా రానా దగ్గుబాటి, ఆయన ప్రేయసి వెన్నెలగా సాయి పల్లవి నటించారు. నవీన్‌ చంద్ర సీనియర్‌ ఉద్యమకారుడు రఘన్నగా, ప్రియమణి కామ్రేడ్‌ భారతక్కగా నటించారు. ఈశ్వరీ, నివేదా పేతురాజ్ కూడా ఇతర  కీలక పాత్రలలో నటించారు. 


Also Read: Crocodile Video: మనిషిని పూర్తిగా మింగేసిన మొసలి.. బయటికి ఎలా వచ్చాడో చుడండి?


Also Read: నాగుపాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు ఏది గెలిచిందంటే! ఊహించని ట్విస్ట్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.