Vishal Rathnam Teaser: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీతో వంద కోట్ల మార్కును క్రాస్ చేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటాడు. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న నయా మూవీ 'రత్నం'. డైరెక్టర్ హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ సహ నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ పేరుతో టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విశాల్ పుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రచార చిత్రం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇందులో విశాల్ విలన్ తల నరికిన సీన్ చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే మాటలు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆర్ఆర్ అదిరిపోయింది. మెుత్తం మీద టీజర్ తోనే మూవీపై ఎనలేని హైప్ క్రియేట్ చేశాడు దర్శకుడు హరి. ఈ చిత్రానికి వివేక్ సాంగ్స్ రాశారు. 


ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీఎస్ జయ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ ఫైట్ మాస్కర్ట్స్ గా వర్క్ చేస్తున్నారు.  మార్క్ ఆంటోని తర్వాత విశాల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి.



Also Read: Silk Smitha Biopic: వెండితెరపైకి సిల్క్‌ స్మిత బయోపిక్‌... హీరోయిన్‌ ఎవరంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook