Hero Vishal: కన్నడ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని హీరో విశాల్‌(Hero vishal) అన్నారు. 'ఎనిమి' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌(Enemy Pre relase Movie Event)లో పునీత్‌కు నివాళులు అర్పించిన అనంతరం విశాల్‌ మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'పునీత్‌ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సమాజానికి తీరని లోటు. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. చివరికి తన కళ్లు కూడా దానం చేశారు. ఆయన చదివించిన 1800 పిల్లల బాధ్యత ఇకపై నేను చూసుకుంటాను. ఒక స్నేహితుడిగా పునీత్‌ సేవా కార్యక్రమాలకు నా వంతు సాయాన్ని అందిస్తానని మాటిస్తున్నాను' అని విశాల్‌ పేర్కొన్నారు. విశాల్‌ గొప్ప మనసుకి  నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 


Also Read: Puneeth Rajkumar's last rites: పునీత్ రాజ్​కుమార్​ అంత్యక్రియలు పూర్తి- సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు


 ఆర్య మాట్లాడుతూ.. ‘పునీత్‌ సర్‌ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం తీరని లోటు. ''మిస్‌ యూ సర్‌''’ అంటూ ఎమోషన్‌ అయ్యారు. కాగా విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన ‘'ఎనిమి'’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook