Vishal - Saamanyudu : విభిన్న కథలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. ఈ హీరోకి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో..తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది. విశాల్ తాజాగా నటించిన చిత్రం 'సామాన్యుడు' (Saamanyudu). క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. విశాల్ (Hero Vishal) మరోసారి పోలీస్ పాత్రలో నటించారు. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ నేడు రిలీజ్ కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ చిత్రాన్ని హిందీ కాకుండా  ఒకేసారి తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్నారు. ఈ మూవీని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు. 



తాజాగా ఈ సినిమా తెలుగులో (Telugu Pre Release Business) రూ. 5 కోట్ల 10 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  తెలంగాణ (నైజాం)లో రూ. 2 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 70 లక్షలు..ఇక ఏపీలో రూ. 2.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 5.5 కోట్ల రాబట్టాలి. ఇపుడున్న పరిస్థితుల్లో విశాల్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ అంటే కష్టం. మరి ఈ సినిమాతో విశాల్ తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటారో లేదో వేచి చూడాలి.


Also Read: Major Release Date: సమ్మర్ బరిలో అడవి శేష్ .. 'మేజర్' రిలీజ్ డేట్ ఫిక్స్..


Also Read: Today Ott Releases: ఈరోజు ఓటీటీ రిలీజ్ ఏమున్నాయో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook