Today Ott Releases: ఈరోజు ఓటీటీ రిలీజ్ ఏమున్నాయో తెలుసా?

Today Ott Releases: ఓటీటీ వచ్చాక జనాలు అన్ని రకాల జోనర్స్ కు సంబంధించిన చిత్రాలను వీక్షిస్తున్నారు. మరి ఈ రోజు ఓటీటీ రిలీజ్ లు ఏమున్నాయో చూద్ధామా..!  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 01:36 PM IST
Today Ott Releases: ఈరోజు ఓటీటీ రిలీజ్ ఏమున్నాయో తెలుసా?

Today Ott Releases: కరోనా వచ్చాక చాలామంది జనాలు ఓటీటీకి ఎక్కువగా అలవాటుపడ్డారు. ఓటీటీ వచ్చాక జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. ఇష్టమైన సినిమా లేదా వెబ్ సిరిస్ ను నచ్చిన ఓటీటీలో చూస్తున్నారు. ఈ రోజు ఓటీటీలో (Today ott releases) అదిరిపోయే సినిమాలతోపాటు ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. వాటిపై ఓ లుక్కేద్ధాం.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK)- AHA
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో ఫినాలేకు చేరుకుంది. చివరి  ఎపిసోడ్‌లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) సందడి చేయనున్నారు. ఈ గ్రాండ్‌ ఎపిసోడ్‌ ఇవాళ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

లూప్ లాపేట (Looop Lapeta) - Netflix
జర్మన్ హిట్ చిత్రం 'రన్ రోలా రన్‌’'కి రీమేక్ గా బాలీవుడ్ లో ‘'లూప్ లాపేట' తెరకెక్కింది’. తన ప్రియుడిని కాపాడుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ (Tapsee) నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘'లూప్ లాపేట’' సందడి చేయనుంది. ఈ సినిమాకి ఆకాష్‌ భాటియా దర్శకత్వం వహించాడు.

ది గ్రేట్ ఇండియన్ మర్డర్ (The Great Indian Murder)-  Hotstar
వికాస్ స్వరూప్ ప్రసిద్ధ నవల 'సిక్స్ సస్పెక్ట్స్' ఆధారంగా తెరకెక్కిన మిస్టరీ సిరీస్ '‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్'’. ఇందులో ప్రతీక్ గాంధీ, రిచా చద్దా (Richa Chadda) డిటెక్టివ్‌లుగా నటించారు. బడా పారిశ్రామికవేత్త హత్య మిస్టరీని ఛేదించడమే కథ. డిస్నీ+హాట్‌స్టార్ లో ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ కానుంది. 

రాకెట్ బాయ్స్ (Rocket Boys)-  SonyLIV 
భారతదేశ అణు మరియు అంతరిక్ష కార్యక్రమాలకు మూలపురుషులైన హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ ల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్ బాయ్స్ (Rocket Boys). అభయ్ పన్ను దర్శకత్వం వహించారు. ఇది సోనీలివ్ లో ఫిబ్రవరి 4న విడుదల కానుంది.

Also Read: Gangubai Kathiawadi Trailer: 'మీ ఇజ్జత్ ఒకసారి పోతే పోయినట్టే.. కానీ రోజు రాత్రి మేము ఇజ్జత్ అమ్ముతాం! లేడీ అర్జున్ రెడ్డా మజాకా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News