Mark Antony Trailer out: కోలీవుడ్ స్టార్ విశాల్(Vishal) డ్యుయల్ రోల్‍లో నటిస్తున్న చిత్రం 'మార్క్ ఆంటోనీ'(Mark Antony Movie). టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో గ్యాంగ్‍స్టర్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘మార్క్ ఆంటోనీ’మూవీ సెప్టెంబర్ 15వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితూ వర్మ, ఎస్‍జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్, అభినయ, కింగ్‍స్లే, మహదేవన్ కీలకపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,టీజర్ పై అంచనాలు భారీగా పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''‘ఏం బాసూ.. రెడీ యా.. రికార్డ్ చేసుకో..''’ అంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మెుదలవుతుంది. 1990ల బ్యాక్‍డ్రాప్ గ్యాంగ్‍స్టర్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతుంది. కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ అంటోనీ పాత్రలో, అతడి కుమారుడి పాత్రలో కూడా విశాలే నటించాడు. మరో కీలకపాత్రలో ఎస్‍జే సూర్య కనిపించనున్నాడు. విశాల్, ఎస్‍జే సూర్య భిన్న గెటప్‌లు ధరిస్తూ చేసిన యాక్షన్ సీన్లు అడియెన్స్ ను అలరించేలా ఉన్నాయి. దీనికి ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను జోడించి వినూత్నంగా తెరకెక్కించారు మేకర్స్. టైమ్ ట్రావెల్, గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాకు కామెడీని యాడ్ చేసి తెరకెక్కించిన సినిమా ఆకట్టుకుంటోంది. 



హీరో విశాల్‌కు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. పందెం కోడి, భరణి, పొగరు, అభిమన్యుడు వంటి సినిమాలు ఇతడికి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. గత కొన్ని సంవత్సరాలుగా విశాల్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ ద్వారా విశాల్ మాంచి కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.


Also Read: Bigg Boss 7 Telugu: ఇవాళే బిగ్‏బాస్ సీజన్ 7 స్టార్ట్.. హౌస్ లోకి వెళ్లినవారు వీరే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook