Mechanic Rocky Trailer: వరుసగా సినిమాలు చేస్తున్నా ఆశించిన ఫలితం అందుకోలేకపోతున్న హీరో విశ్వక్‌ సేన్‌ ఈసారి హిట్‌ కోసం 'మెకానిక్‌' రూపంలో వస్తున్నాడు. చిన్న కథనే కానీ పవర్‌ ఫుల్‌ పాత్రలో వస్తున్నట్టు కనిపిస్తోంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ జోడీగా విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న సినిమా 'మెకానిక్‌ రాకీ'. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ఆదివారం విడుదల చేశారు. యూత్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో హాస్యం, ప్రేమ, యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్న మెకానిక్‌ రాకీ ట్రైలర్‌ ఎలా ఉందో చూద్దాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sudeep Mother: కిచ్చా సుదీప్ ఇంట్లో విషాదం.. హీరోకి మాతృవియోగం..!


తండ్రి మెకానిక్‌ దుకాణాన్ని అయిష్టంగానే నిర్వహిస్తున్న రాకీ పాత్రలో విశ్వక్‌ సేన్‌ మెరిశాడు. కొత్త వాళ్లకు డ్రైవింగ్‌ నేర్పే పనిలో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ పరిచయమవుతారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక తమ మెకానిక్‌ గ్యారేజ్‌పై కన్నేసిన విలన్‌ పాత్రధారి సునీల్‌ దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. అతడి బారి నుంచి గ్యారేజ్‌ను కాపాడుకోవడమే మిగతా కథ అని ట్రైలర్‌ను బట్టి చర్చ జరుగుతోంది.

Also Read: Narudi Brathuku Natana: ‘నరుడి బ్రతుకు నటన’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే థియేటర్లలో సందడి


'నువ్వు ఏం భయపడకు నాన్న. నేను ఎలాగైనా సివిల్‌ ఇంజనీర్‌ అవుతా' అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవగా.. 'కంప్యూటర్స్‌ చదివి సివిల్‌ ఇంజనీర్‌ అవుతావా' అంటూ తండ్రి పాత్రధారి వీకే నరేశ్‌ పరిహాసమాడతాడు. తన కొడుకు పనికి రానివాడని తిడుతూ ఇలా తండ్రీకొడుకుల మధ్య గొడవ ఉండేట్టు కనిపిస్తోంది. రోజూ గిఫ్ట్‌లు ఇస్తూ చివరకు ఒకరోజు గిఫ్ట్‌ ఇస్తుంటే ఆరోజుకు ఎలాంటి ప్రత్యేకత లేకపోతే 'అంబేడ్కర్‌ జయంతి' అని చెప్పి గిఫ్ట్‌ ఇవ్వడం నవ్వులు పూయించింది.


డైలాగ్స్ కిర్రాక్
'రిపేర్‌కు వస్తే ఫ్రీగా సర్వీసింగ్‌ చేస్తా సౌండ్‌ ఎక్కువైతే బోర్‌ చేస్తా. అంతకుమించి మొండికి వస్తే మాత్రం ఒక్కొక్కడి ఇంజన్‌ తీసి కూష్మాండంలో బిగిస్తా' అంటూ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ ఆకట్టుకుంది. 'నువ్వు రంకిరెడ్డి అయితే నేను రంకు రెడ్డి' సునీల్‌కు మాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అంతకుముందు 'ఒక్కొక్కడికి గుత్తి గోళిలవుతాయి' అనే డైలాగ్‌ కూడా ఆకట్టుకుంది. ఇలా పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో పాటు మీనాక్షి చౌదరిని, శ్రద్ధా శ్రీనాథ్‌ను ప్రేమలో పడేసే సీన్లు ప్రత్యేకంగా ఉన్నాయి.


చాలా రోజుల తర్వాత హిట్?
జేక్స్‌ బెజోయ్‌ సంగీతం సినిమాకు సానుకూలంగా నిలవనుంది. ట్రైలర్‌లో బీజీఎం ఆకట్టుకుంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా వాస్తవానికిదీపావళిని పురస్కరించుకుని అక్టోబర్‌ 31వ తేదీకి విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో నవంబర్‌ 22వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్‌ కొట్టాలనే తపనతో ఉన్న విశ్వక్‌ సేన్‌కు మరి 'మెకానిక్‌ రాకీ' విజయం అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.