Vishwak Sen Sankranthi look from Gangs of Godavari: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen) నయా మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari). ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty), అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విశ్వక్‌సేన్ కొత్త లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో విశ్వక్ సేన్ పందెం కోడిని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్‌ సింగిల్‌ సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్‌ నెట్టింట మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు విశ్వక్‌సేన్‌ దీంతోపాటు VS10లో కూడా నటిస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. విశ్వక్‌సేన్‌ మరోవైపు అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌ గామి (Gaami) షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేయగా.. రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇందులో విశ్వక్ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్‌ దర్శకుడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంజీ అభినయ, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారికా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశ్వక్‌సేన్ మరోవైపు ధమ్‌ కీ సీక్వెల్‌ కూడా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.




Also Read: Devara Movie: రిలీజ్ కాక‌ముందే ఓటీటీ ఫిక్స్ చేసుకున్న 'దేవ‌ర'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? 


Also read: Raja Saab: రాజా సాబ్ గా రాబోతున్న ప్రభాస్.. లుంగీ లుక్ తో అదరగొట్టిన డార్లింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook