Vishwak Sen AVAK Teaser: కొత్త క్యారెక్టర్లో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న టీజర్
Ashoka Vanamlo Arjuna Kalyanam Teaser: ఏజ్ బార్ అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్తే.. అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు... ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్‌కు ఒకే అన్న తర్వాత వచ్చే సమస్యలు.. ఇలా కామెడీ.. ఎమోషనల్ సీన్స్‌తో `అశోక వనంలో అర్జున కళ్యాణం` టీజర్ అదిరిపోయింది.
Vishwak Sen New Movie Teaser: విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ "అశోక వనంలో అర్జున కళ్యాణం". డిఫరెంట్ కథలతో సినిమాలు దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్.. ఈసారి కూడా విభిన్నమైన స్టోరీతో తెరకెక్కుతోన్న మూవీలో నటిస్తున్నాడు.
ఇక అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీలో (Ashoka Vanamlo Arjuna Kalyanam) హీరోయిన్‌గా రుష్కర్ దిల్లాన్ నటిస్తోంది. ఈ మూవీని వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్‌పై.. బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. విద్యా సాగర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
"అశోక వనంలో అర్జున కళ్యాణం" మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ (Glimpse) అలాగే సాంగ్ ఎంతో అలరించాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ను (Teaser) రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ టీజర్‌లో బాగా వయస్సు అయిపోయిన అబ్బాయిగా కనిపించాడు విశ్వక్ సేన్. ఇక టీజర్‌ను బట్టీ ఏజ్ బార్ అయిన అబ్బాయికి మ్యారేజ్ మ్యాచ్ ఫిక్స్ అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరెకెక్కినట్లు తెలుస్తోంది.
ఇంటర్‌క్యాస్ట్ పెళ్లి సెట్ చేసుకున్న అబ్బాయి.. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు.. పెళ్లి తర్వాత ఆ అమ్మాయితో జర్నీ ఎలా సాగిందనే కాన్సెప్ట్‌తో "అశోక వనంలో అర్జున కళ్యాణం" తెరకెక్కింది. పెళ్లి చూపుల్లో ఏజ్ బార్ అబ్బాయికి ఎదురయ్యే సమస్యల్ని మంచి కామెడీతో (Comedy) చూపించారు. ఎమోషనల్ సీన్స్ (Emotional Scenes) కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి టీజర్‌లోనే "అశోక వనంలో అర్జున కళ్యాణం" స్టోరీ (Movie Story) ఏంటో తెలిసిపోయింది.
ఇక ఈ మూవీ టీజర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. సమ్మర్ బరిలో చాలా పెద్ద సినిమాలు (Cinema) నిలవగా.. విశ్వక్‌సేన్ "అశోక వనంలో అర్జున కళ్యాణం" మూవీ (Movie) మార్చి 4న విడుదల కానుంది.
Also Read: Chalo Vijayawada: ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ రగడ.. 'చలో విజయవాడ'కు ప్రభుత్వం అడ్డంకులు!
Also Read: Radhe Shyam Release Date: మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ రిలీజ్.. ఓటీటీపై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి