Chalo Vijayawada: ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ రగడ.. 'చలో విజయవాడ'కు ప్రభుత్వం అడ్డంకులు!

Chalo Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 3) 'చలో విజయవాడ' కార్యక్రమానికి పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను నిర్బంధిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 12:13 PM IST
    • చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు పిలుపు
    • అందుకు అనుమతి లేదంటున్న పోలీసులు
    • ఆ కార్యక్రమానికి రావొద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిర్బంధాలు
Chalo Vijayawada: ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ రగడ.. 'చలో విజయవాడ'కు ప్రభుత్వం అడ్డంకులు!

Chalo Vijayawada: ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. కొత్తగా అమలు చేసిన పీఆర్సీ పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉద్యమ కార్యచరణలో భాగంగా గురువారం 'చలో విజయవాడ'కు పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. 

అయితే అందుకు అనుమతి లేదంటున్న పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉద్యోగులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు విజయవాడ వెళ్లొద్దని వివిధ జిల్లాల ఉద్యోగ సంఘాలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల ఉద్యోగులను గృహనిర్బంధం చేస్తున్నారు. అయితే గృహనిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఉద్యమకారులు అంటున్నారు. 

'చలో విజయవాడ' కార్యక్రమానికి హజరు కాకుండా ఉద్యోగులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. విజయవాడ రానున్న వారి వివరాలను సేకరించి.. ముందుస్తు నోటీసులను పోలీసులు జారీ చేస్తున్నారు. మరోవైపు పీఆర్సీ ఉద్యమంలో భాగంగా నేటి (బుధవారం) నుంచి ప్రభుత్వ యాప్ లను నిలిపేయనున్నట్లు పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది. 

జిల్లాల వారిగా ఉద్యోగుల గృహనిర్బంధాలు..

'చలో విజయవాడ' కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన అనంతపురం జిల్లాకు చెందిన ఎన్జీవో అధ్యక్షుడు నరసింహులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శరత్ ను నిర్బంధించడం సహా నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. 

దీంతో పాటు ఉద్యోగులను రానివ్వకుండా విజయవాడకు వచ్చే మార్గాల్లో పోలీసుల తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులను మోహరించి.. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఉద్యోగులపై నిఘా ఉంచారు. మరోవైపు గుంటూరు జిల్లాలోనూ 'చలో విజయవాడ' కార్యక్రమానికి ఉద్యోగులు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. విజయవాడకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రాత్రే ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన నాయకులు విజయవాడకు వెళ్లారు.  

Also Read: APSRTC Employees Strike: సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులు.. ఏపీలో ఆ రోజు నుంచి బస్సులు బంద్?

Also Read: AP Covid-19 Update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు...కొత్త కేసులు ఎన్నంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News