Vikram's Mahaan Teaser: మనం పెట్టిందే చట్టం.. మనం పోసేదే మద్యం అంటోన్న "మహాన్"

Mahaan Teaser: తండ్రీకొడుకులు విక్ర‌మ్‌, ధ్రువ్ విక్ర‌మ్ కలిసి నటించిన మహాన్‌ మూవీ త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుంది. తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్‌‌ ఆకట్టుకుంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 04:47 PM IST
  • మహాన్ మూవీ టీజర్‌‌ రిలీజ్‌
  • ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌
  • కుమారుడు ధ్రువ్‌తో కలిసి నటించిన విక్రమ్
Vikram's Mahaan Teaser: మనం పెట్టిందే చట్టం.. మనం పోసేదే మద్యం అంటోన్న "మహాన్"

Mahaan Official Telugu Teaser: తమిళ హీరో చియాన్ విక్రమ్‌ కీ రోల్‌లో యాక్ట్‌ చేసిన మూవీ "మహాన్‌". కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌కానుంది. ఈ మూవీలో ఫస్ట్ టైమ్‌ విక్రమ్‌ ఆయన కుమారుడు ధ్రువ్‌తో కలిసి నటించారు. కాగా తాజాగా "మహాన్​" (Mahaan) మూవీ టీజర్‌‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

మద్యపాన నిషేధంపై కొందరు వ్యక్తులు చేసే పోరాట సీన్స్‌తో ప్రారంభమవుతుంది ఈ టీజర్. (Teaser) మద్యంతో పాటు ఇతర అసాంఘిక కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ఒక మహాత్ముడిలా జీవిస్తాను అంటూ తండ్రికి మాటిచ్చిన హీరో... పెద్దగయ్యాక ఏం చేశాడనే బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కింది. 

ఇక తాజాగా రిలీజైన "మహాన్​" టీజర్‌‌లోని సీన్స్ అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఎవరు బార్‌‌ను లీజ్‌కు తీసుకున్నా కూడా అతను కచ్చితంగా మన సిండికేట్‌ మనిషై ఉండాలంటూ సాగే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. అలాగే మనం పెట్టిందే చట్టం, మనం పోసేదే మద్యం అంటూ టీజర్‌‌లో సాగే డైలాగ్స్‌తో మూవీపై (Movie) అంచనాలు పెరిగాయి.

ఫస్ట్ టైమ్ విక్ర‌మ్‌, ధ్రువ్ విక్ర‌మ్ కాంబోలో వస్తోన్న ఈ మూవీని ఫ్యాన్స్ అంతా థియేట‌ర్‌లో చూడాల‌నుకున్నారు. కానీ కొవిడ్ వల్ల ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయాలని మహాన్ మూవీ యూనిట్ ఫిక్స్ అయింది. కాగా 2016లోనే ఈ మూవీ స్టోరీని విక్ర‌మ్‌కు.. డైరెక్టర్‌‌ కార్తీక్ సుబ్బ‌రాజ్ చెప్పాడట. కానీ అప్పటికే విక్రమ్ (Vikram) ఇంకొక్క‌డు మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో పోస్ట్ పోన్‌ చేసుకున్నాడట. అప్పటి నుంచి అలా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ చివరకు ఇప్పుడు తెరకెక్కింది. మొత్తానికి ఈ మూవీ (Movie) ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌ కానుంది.

Also Read: Anupama Parameswaran: బేబీ బంప్‌తో అనుపమ పరమేశ్వరన్.. షాక్‌లో ఫాన్స్! కంగ్రాట్స్ చెప్పిన కమెడియన్!!

Also Read: Salman -Katrina: కత్రినా కైఫ్‌ వివాహంపై స్పందించిన సల్మాన్‌ ఖాన్‌.. ఇంతకీ ఏమన్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News