Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో  ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు.  ‘బింబిసార’ వంటి సోషియో ఫాంటసీ మూవీతో ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన వశిష్ఠ.. మెగాస్టార్ చిరంజీవితో కూడా అదే సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఔట్ పుల్ కూడా వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ కంప్లీటైనట్టు సమాచారం. చిరంజీవి కూడా తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పేసారు.  ఈ రోజు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే విడదల చేసిన పోస్టర్ చూస్తుంటే.. చేతిలో శూలం పట్టుకొని ఉన్న చిరంజీవి లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ లు నటిస్తున్నారు. చాలా యేళ్ల తర్వాత చిరు సరసన ముగ్గురు భామలు నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవికి కీలకం అనే చెప్పాలి.


‘ఖైదీ నంబర్ 150’ తర్వాత చిరంజీవి నటించిన ఏ చిత్రాలు పూర్తిగా అభిమానులను అలరించలేకపోయాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత చేసిన ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ సినిమాలు ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమయ్యాయి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా హిట్టైయిన అందులో రవితేజ మరో హీరోగా ఉన్నాడు. కానీ రొటిన్ సబ్జెక్ట్ తో సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ సినిమా గట్టేక్కిందనే కామెంట్స్ వినబడ్డాయి. అందుకే ఇపుడు వశిష్ఠతో చేయబోతున్న ‘విశ్వంభర’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాలని చిరు ఉవ్విళ్లురుతున్నాడు. అభిమానులు కూడా ఈ సినిమాపై అదే స్థాయిలో హోప్స్ పెట్టుకున్నారు. మరి వారి ఆశలను విశ్వంభర మూవీ ఏ మేరకు అలరిస్తుందనేది చూడాలి. 


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి