వెండితెరపైకి విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్.. హీరోగా అమీర్ ఖాన్?
ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ గురించి నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన బయోపిక్ పై ఆనంద్ స్పందించారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Vishwanathan Anand Biopic: గత కొద్ది కాలంగా వెండితెరపై క్రీడాకారుల బయోపిక్స్ సందడి చేస్తున్నాయి. తాజాగా ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్(Vishwanathan Anand Biopic) తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు మూవీ మేకర్స్. ఆనంద్ బయోపిక్ ను ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్(Anand L Rai) సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తన బయోపిక్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు విశ్వనాథ్ ఆనంద్.
“నేను నా బయోపిక్ తెరకెక్కించడానికి అంగీకరించా.. ఈ విషయమై ఇప్పటికే నిర్మాతతో పలుమార్లు చర్చించాం.. నా జీవిత విశేషాలను వారికి చెప్పాను. త్వరలోనే స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయి. పని త్వరలోనే ప్రారంభమవుతుంది. బయోపిక్ గురించి ఇప్పుడేం చెప్పలేను.. షూటింగ్ ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదు. ఈ బయోపిక్ గురించి తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి” అన్నారు విశ్వనాథన్ ఆనంద్.
Also Read: టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా
మీ బయోపిక్(Biopic)కు ఎవరు దర్శకుడు అని ప్రశ్నించగా.. ఇప్పుడు తాను ఏం చెప్పలేనని.. ప్రస్తుతం పనులు మాత్రమే జరుగుతున్నాయని చెప్పగలను..అన్నారు. అలాగే.. ఈ సినిమాలో మీ పాత్రలో ఏ హీరోను చూడాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. ఆనంద్ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఆనంద్ మాట్లాడుతూ.. సినిమాలో నా పాత్రను ఎవరు పోషిస్తారో నేను చెప్పలేను. కానీ నేను ఒకరిని అనుకుంటున్నాను.. విశ్వనాథన్ ఆనంద్‌గా అమీర్ ఖాన్(Aamir Khan) నటిస్తే బాగుంటుందని.. ఆయనకు నాకు పోలికలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇక రాజకీయాల్లోకి వస్తున్నారా ? అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో(Politics)కి వచ్చే ఆలోచన లేదని ఎప్పటికీ చెస్ ఆడుతూ ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇప్పట్లో పదవి విరమణ (retirement) చేసే ఆలోచన లేదని.. కరోనా సమయం(CoronaVirus)లోనూ ఆన్ లైన్ టోర్నమెంట్స్ ఆడానని.. నవంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ చాంపియన్ షిప్ లకు వ్యాఖ్యతగా ఉండబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు ఆనంద్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook