Vyjayathimala bali - Padma Vibhushan: సీనియర్ నటి వైజయంతిమాల బాలికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం..
Vyjayathimala bali - Padma Vibhushan: తాజాగా కేంద్ర ప్రభుత్వం 2024 యేదాదికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు చిరంజీవి,వైజయంతి మాల, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యంలకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అందజేసారు.
Vyjayathimala bali - Padma Vibhushan: భారతీయ సినీ పరిశ్రమలో మొదటి తరం అత్యున్నత కథానాయికల్లో వైజయంతి మాల బాలి ఒకరు. బాలీవుడ్ తొలి తరం లేడీ సూపర్ స్టార్‌గా సత్తా చాటింది. పుట్టింది దక్షిణాదిలోని తమిళనాడులోనైనా.. ఉత్తరాది చిత్ర పరిశ్రమను ఏలింది వైజయంతిమాల బాలి. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యంతో పాటు సంగీతం లలిత కళల్లో ప్రావీణ్యం సంపాదించిన ఈమె పుట్టి పెరిగింది చెన్నైలోనే. పదహారేళ్లపుడు 'వజ్కై" సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. హిందీలో అగ్రశ్రేణి హీరోయిన్‌గా ఒక తరానికి కలల రాణిగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అప్పట్లో హిందీలో ముఖ్యంగా సంగీత, నృత్య ప్రధాన చిత్రాలంటే దర్శక, నిర్మాతలకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు వైజయంతి మాలదే అని చెప్పాలి. ఆపై నటనకు స్కోప్ ఉన్న చిత్రాల్లో తనను తాను ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోలైన రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ వంటి హీరోల సరసన నటించి ధీటుగా మెప్పించింది. ఈమె నటించిన చిత్రాల విషయానికొస్తే.. 'ఆమ్రపాలి', గంగా జమున,నాగిన్, దేవదాస్,చిత్రాలు నటిగా ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. తమిళ చిత్రంతో పరిచయమైన ఈమె తన రెండో సినిమాను తెలుగులో చేయడం విశేషం.
'సంఘం', 'వేగుచుక్క', 'విజయకోట వీరుడు','వీర సామ్రాజ్యం', 'విరిసిన వెన్నెల', 'బాగ్దాద్ గజదొంగ', 'చిత్తూరు రాణీ పద్మిని'తదితర స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పలకరించింది. చిత్ర పరిశ్రమ నుంచి వైదొలిగిన డాన్సర్‌గా పలు కార్యక్రమాలను చేస్తూ వచ్చింది. 1968లో ఈమె చమన్‌లాల్ బాలిని వివాహా మాడారు. ఇక ఈమెకు పద్మవిభూషణ్ కంటే ముందు 1968లో కేంద్రం నుంచి పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. దీంతో పాటు తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణితో పాటు వివిధ సంస్థలు ఇచ్చే అవార్డులను గెలుచుకుంది.
ఈమె కేవలం సినీ రంగంలోనే కాదు.. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసారు. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరి అదే యేడాది చెన్నై సౌత్ నుంచి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. 1993లో కేంద్రం ఈమెను రాజ్యసభకు ఎంపిక చేసింది. 1999 వరకు రాజ్యసభ సభ్యరాలిగా సేవలు అందించారు. ఆ తర్వాత వాజ్‌పేయ్ ప్రభుత్వం చేస్తోన్న పనులు చేసి భారతీయ జనతా పార్టీలో చేరింది. ప్రస్తుతం ఈమె వయసు 90 యేళ్లు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా మూడు పద్మ అవార్డులు అందుకున్న నటిగా వైజయంతిమాల బాలి రికార్డు క్రియేట్ చేసారనే చెప్పాలి. త్వరలోనే రాష్ట్రపతి ద్రైపది ముర్ము చేతులు మీదుగా ఈమె ఈ అవార్డును అందుకోనున్నారు.
Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook