Warina Hussain Special Song in God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా సందర్భంగా తెలుగు సహా హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. చాలా కాలం పాటు ప్రమోషన్స్ విషయంలో అశ్రద్ధ వహించిన సినిమా యూనిట్ ప్రస్తుతానికి సినిమా ప్రమోషన్స్ మీద కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెన్సార్ పూర్తయిన తర్వాత రీ షూట్ చేస్తున్నట్లు ఒక వార్త బయటకు వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ రీ షూట్ మరేంటో కాదని ఒక ఐటమ్ సాంగ్ అని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, సత్యదేవ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఈ సాంగ్ రూపొందించారని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇటీవల బింబిసార సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ముంబై భామ వరీనా హుస్సేన్ ఈ సాంగ్ లో ఆడి పాడినట్లుగా తెలుస్తోంది.


అయితే మరో ప్రచారం ఏమిటంటే కేవలం మెగాస్టార్ కాంబినేషన్ లో ఈ సాంగ్ రూపొందించారని అంటున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఇప్పటికే తార్ మార్ టక్కర్ మార్ అనే సాంగ్ రూపొందించారు. అందుకే ఈ ఐటెం సాంగ్ కేవలం మెగాస్టార్ కాంబినేషన్లో మాత్రమే ఉంటుందని ప్రచారం జరుగుతోంది, ఇక ఈ సాంగ్ ను చోటా కా నాయుడు షూట్ చేశారని తెలుస్తోంది.


మోహన్ రాజా డైరెక్షన్ లో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో చిరంజీవి, నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. సునీల్, పూరి జగన్నాథ్, సముద్రఖని వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల విషయానికి ఎలా ఉన్నా మెగాస్టార్ అభిమానులను అలరించడం పక్కా అని ఇన్సైడ్ వర్గాల ఇన్ఫర్మేషన్. 


Sudershan Theatre Issue For God Father: ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమాల వచ్చినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ కి ఈ సినిమాను మెయిన్ థియేటర్ ఇస్తూ ఉంటారు. కానీ సినిమా విడుదలకు వారం రోజులు ముందే విడుదలవుతున్న పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం ఆ ధియేటర్ బ్లాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకున్న మెగా ఫ్యామిలీ ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో చివరి నిమిషంలో సుదర్శన్ థియేటర్ దొరికిందని చెబుతున్నారు. 


Thaman Live Concert at God Father Pre Release Event:  
ఇక 28వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురంలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఇక సినిమా యూనిట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త భిన్నంగా ఒక మ్యూజికల్ ఈవెంట్ లాగా మార్చబోతున్నారని తెలుస్తోంది. థమన్ అండ్ టీం లైవ్ లో మ్యూజిక్ అందించబోతున్నారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఉండబోతున్నారని ఆయనకు మించిన గెస్ట్ ఎవరు అక్కర్లేదని సినిమా యూనిట్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


Also Read: Faria Abdullah in SSMB28: మహేష్ బాబుతో చిట్టి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!


Also Read: Mahesh Babu Zee Telugu : జీ తెలుగు అవార్డుల వేడుకకు మహేష్ బాబు.. ఇక రచ్చే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook