చాముండేశ్వరి, అఖిలాండేశ్వరితో వాదిస్తూ, బెదిరిస్తూ నీ తలలో గాయానికి రోజూ ఇంజెక్షన్ ఇవ్వాలని, లేదంటే రక్తం గడ్డ కట్టుకుని చనిపోతావని చెప్పి బెదిరిస్తుంది. ఆ ఇంజెక్షన్‌ని డాక్టర్‌తో ఇప్పించేది నేనే అని, అలా  చేయని పక్షంలో నీ శవం ఐస్‌ గడ్డల్లో ఉంటుందని చెప్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మర్యాదగా చెక్ బుక్‌లో సంతకం పెట్టమని చెక్ బుక్ అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది. మరోవైపు చంద్రముఖిని గదిలో బంధించిన నీలాంబరి, పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


నిజంగానే చంపేస్తుందేమో అని అనుకుంటున్న సమయంలో.. అది నా అక్క, నేనెలా చంపుతా అని రౌడీతో చెప్పుకొస్తుంది. గదిలో ఉన్న చంద్రముఖి లోపలకు ఎవ్వరూ రాకుండా తలుపుకు అడ్డంగా లోపల ఉన్న వస్తువులన్నీ పెడుతుంది. మరోవైపు చంద్రముఖిని వెదుక్కుంటూ వచ్చిన మహి, పార్వతి మిగతా వాళ్లు.. డాక్టర్ నెంబర్‌‌ కనుక్కుని చేసి చంద్రముఖి ఎక్కడుందో తెలుసుకుంటారు. వాళ్లు అక్కడికి వచ్చి వెతుకుతున్న సమయంలో నీలాంబరి గదిలోకి వెళ్లి దాక్కుంటుంది.  మరి వాళ్లు చంద్రముఖిని కనుక్కున్నారా లేదా అనేది తెలియాలంటే ముద్ద మందారం సీరియల్‌ని వీక్షించాల్సిందే. ఈ సీరియల్ పూర్తి ఎపిసోడ్స్‌ని ZEE5లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.