Wedding Bells : మరో తెలుగు హీరో పెళ్లి.. ఆంధ్ర వారితో వియ్యమందుకుంటున్న దిల్ రాజు ఫ్యామిలీ..
Dil Raju : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుటుంబం ఆనందం లో మునిగి తేలుతోంది. దిల్ రాజు ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు అన్న కొడుకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. అది కూడా ఒక ఆంధ్రా అమ్మాయితో ఈ పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లి ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తూ వచ్చాయి కానీ ఇప్పుడు ఏకంగా పెళ్లి తేదీ కూడా ఖరారు అయ్యింది. దిల్ రాజు ఇంట జరగబోతున్న ఈ పెళ్లి గురించి మరికొన్ని వార్తలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Asish Reddy : ఈ మధ్య టాలీవుడ్ లో వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఒకరి ఇంటి తర్వాత మరొకరి ఇంట్లో పెళ్లి బాజాలు మ్రోగుతున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ లు నవంబర్ 1 న జరగబోతున్న వివాహం కోసం ఇటలీ వెళ్ళిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ రెండవ కుమార్తె హవ్య వాసిని నిశ్చితార్థం కూడా ఈ మధ్యనే జరిగింది. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఇప్పుడు మరొక సెలబ్రిటీ ఇంట్లో పెళ్లి బాజాలు మ్రోగబోతున్నాయి. అది ఎవరో కాదు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో. స్వయంగా దిల్ రాజు తమ్ముడు సోదరుడు నిర్మాత శిరీష్ కుమారుడు అయిన ఆశిష్ రెడ్డి నిశ్చితార్థం డిసెంబర్ లో జరగబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో వివాహానికి తేదీని ఫిక్స్ చేశారట. ఇది ప్రేమ వివాహం కాదు అని ఇరు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుని ఖాయం చేసిన పెళ్లి అని సమాచారం.
ఆడపిల్ల తరుపువారు ప్రైవసీ అడగడంతో వారికి సంబంధించిన వివరాలు ఎక్కడా బయటకు రాలేదు. ఆడపిల్ల తరుపువారు ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వారని సమాచారం. దీంతో దిల్ రాజు ఆంధ్ర అమ్మాయితో వియ్యం అందుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్లో నిశ్చితార్థం తర్వాత ఫిబ్రవరి 14న జైపూర్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.
ఇక ఆశిష్ రెడ్డి గత ఏడాది రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఈ సినిమా తర్వాత ఆశిష్ ఇప్పుడు సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. దిల్ రాజు తో పాటు సుకుమార్ రైటింగ్స్ వారు కూడా ఈ సినిమాని సహనిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలోనే ఉంది. సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు
Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook