Karthika Deepam: తెలుగు సీరియల్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కార్తీక దీపం ఇప్పుడు సీక్వెల్‌గా రెండో భాగం రానుంది. తొలి భాగంతో యావత్‌ తెలుగు టీవీప్రియులను ఆకట్టుకున్న ఈ సీరియల్‌ 'కార్తీక దీపం ఇది నవ వసంతం' అనే పేరుతో పార్ట్‌ 2 ఈనెల 25వ తేదీ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా సీరియల్స్‌ చరిత్రలోనే తొలిసారిగా సీరియల్‌కు ప్రివ్యూ వేడుక నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సీరియల్‌ బృందం కీలక విషయాలు వెల్లడించింది. మొదటి భాగం మాదిరే రెండో భాగం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది. అయితే రెండో భాగంలో కీలక మార్పులు జరిగాయని ఆ టీమ్‌ వర్గాలు వెల్లడించాయి. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Karthika Deepam: సినిమా రేంజ్‌లో కార్తీక దీపం.. చరిత్రలోనే తొలిసారి సీరియల్‌కు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌


 


రాజేంద్ర దర్శకత్వంలో నిరుపమ్‌ పరిటాల, ప్రేమీ విశ్వనాథ్‌ జంటగా 'కార్తీక దీపం' వస్తున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో మాదిరి రెండో భాగంలో పాత్రల పేర్లు ఏమాత్రం మారడం లేదు. నిరుపమ కార్తీక్‌, ప్రేమీ దీప పాత్రలో కనిపించనుండగా వారిద్దరి పేర్లతోనే 'కార్తీకదీపం' అని పేరు పెట్టారు. దీప పాత్ర మొదటి భాగంలో మాదిరే ఉంటుంది. అయితే కార్తీక్‌ పాత్ర మారిపోయింది. అప్పుడు డాక్టర్‌ బాబుగా కనిపించగా రెండో భాగంలో హోటల్‌ గ్రూప్స్‌ చైర్మన్‌గా కనిపించనున్నారు. వారింట్లో పనిమనిషి పాత్రలో దీప కనిపించనుంది. ఇక తొలి భాగంలో హైలెట్‌గా నిలిచిన 'మోనిత' పాత్ర ఇందులో ఉండడం లేదని తెలిసింది. కార్తీక్‌, దీపల మధ్య విబేధాలకు మూలకారణమైన మోనిత పాత్ర లేకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక తల్లి పాత్రధారి సౌందర్య కూడా ఈ సీరియల్‌లో కనిపించడం లేదంట. 

Also Read: Jyotika Strong Reply: 'హీరో సూర్యను భర్తగా నాకు అప్పు ఇస్తావా?' హీరోయిన్‌ జ్యోతిక ఘాటు రిప్లయ్‌


కానీ మోనిత, సౌందర్య లాంటి రెండూ పాత్రలు ఈ సీరియల్‌లో ఉంటాయని టీమ్‌ ప్రకటించింది. పాత్రల స్వరూపం మారినా అదే సందేశం.. అదే భావోద్వేగాలతో కూడిన వినోదం అందించేందుకు 'కార్తీకదీపం' సిద్ధమవుతోంది. తొలి భాగం 1569 ఎపిసోడ్లు ఆరేళ్లు నడిపించగా మలి భాగం అంతకుమించి ఉంటుందని నిరుపమ్‌ మాటల్లో తెలిసింది. అయితే ఐపీఎల్‌కు పోటీగా కార్తీకదీపం వస్తుందని బృందం ప్రకటించింది. ఇక 25 నుంచి క్రికెట్‌, వార్తలతో పోటీపడి తమ సీరియల్‌ నడుస్తుందని పేర్కొంది. టీవీ రిమోట్‌ కోసం ఇళ్లల్లో గొడవపడుతారని వివరించింది.

రెండో భాగం సీరియల్‌కు సంబంధించి గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ వంటివి ప్రొమోలుగా విడుదల చేశారు. వాటిని చూస్తే కార్తీకదీపం కొనసాగింపుగానే ఈ సీరియల్‌ ఉంటుందని.. దానిలోని మాతృత్వం ఎక్కడా కోల్పోకుండా సీరియల్‌ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. నిర్మాత భారతీకృష్ణ నిర్మాతగా వస్తున్న 'కార్తీకదీపం ఇది నవ వసంతం' సీరియల్‌ ఈనెల 25వ తేదీన మా టీవీలో ప్రసారం కానుంది. ఓటీటీలోనైతే హాట్‌ స్టార్‌లో చూడవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter