Karthika Deepam 2 Event: తెలుగు బుల్లితెరలో ఏ సీరియల్‌కు రానంత క్రేజీ 'కార్తీక దీపం'కు వచ్చింది. ఆ సీరియల్ వీక్షణలపరంగానే కాదు చాలా చాలా రికార్డులు నెలకొల్పింది. సీరియల్ కథ, ముఖ్యంగా హీరోయిన్ పాత్ర ఇంటిల్లిపాదిని ఆకట్టుకుంది. ఈ సీరియల్ సీక్వెల్‌గా రాబోతున్నది. త్వరలోనే ఇది ప్రారంభం కానుండగా సీరియల్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. సీరియల్ పునఃప్రారంభం సందర్భంగా 'ప్రీ రిలీజ్ వేడుక' నిర్వహించనున్నారని సమాచారం.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ కొత్త కారు.. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై.. ఇంతకీ దేనికోసం?
కార్తీక దీపం సీక్వెల్‌గా 'కార్తీక దీపం ఇది నవ వసంతం' పేరిట కొత్త కథాంశంతో వస్తోంది. ఈనెల 25వ తేదీ నుంచి మా టీవీలో ప్రసారం కానుంది. కార్తీక దీపం బృందం సీక్వెల్‌కు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనుంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి ఓ ప్రకటన విడుదలైంది. శుక్రవారం (మార్చి 21) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ వేడుక నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుకకు సీరియల్ ప్రధాన పాత్రధారులు నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, శోభా శెట్టి తదితరులతోపాటు సీరియల్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు తరలిరానున్నారు.
Also Read: Tillu Square: ''మరింత గ్లామర్ డోస్ పెంచుతా.. మీకేంటి అభ్యంతరం?'' టిల్లు లవర్ అనుపమ
ఇక కార్తీక దీపం మరో ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ సీరియల్‌ను ఇతర భాషల్లోకి కూడా రీమేక్ చేస్తున్నారట. తమిళ్ జీ ఛానల్‌లో తమిళ భాషలో ఈ సీరియల్ ఇప్పటికే ప్రసారమవుతోంది. త్వరలోనే మిగతా భాషల్లో కూడా రీమేక్ చేయనున్నారు. తెలుగు సీరియల్స్ ఇతర భాషల్లోకి రీమేక్ జరగడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతను ఈ సీరియల్ సొంతం చేసుకోబోతున్నది. 'కార్తీక దీపం' సీరియల్ మొదటి భాగంలో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత అనే పాత్రల చుట్టూ సాగుతుంది.
ఇక రెండో భాగంలో డాక్టర్ బాబు, వంటలక్కకు పుట్టిన పిల్లల భవిష్యత్ విషయమై ఉంటుందని సమాచారం. సీరియల్స్ కథ ముందే చెప్పేయరు. మొదటి భాగానికి రెండో భాగానికి మధ్య అనుబంధం కొనసాగిస్తూ దాదాపు మూడేళ్లకు సరిపడా ఎపిసోడ్‌లు సిద్ధం చేసుకున్నారని సమాచారం. మరి మొదటి భాగం మాదిరి 'కార్తీక దీపం' సీక్వెల్ బుల్లితెర వారిని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter