అది లుంగీనా.. లంగానా..? స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ డ్యాన్సింగ్ మ్యాస్ట్రో, నటుడు హృతిక్ రోషన్ ప్రస్తుతం దుబాయ్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఆయన ధరించిన డ్రెస్సు హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్‌లో విచిత్ర, విభిన్న వేషధారణకు కెరాఫ్ అడ్రస్ రణ్‌వీర్ సింగ్. అయితే స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా షేర్ చేసిన ఓ ఫొటోలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హృతిక్ ఏంటి.. రణ్‌వీర్ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హృతిక్ ప్రస్తుతం దుబాయ్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ దిగిన కొన్ని ఫొటోలను సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
Also Read: టీమిండియా వైట్ వాష్‌కు 5 కారణాలు!
ఆ ఫొటో గమనిస్తే.. అందులో హృతిక్ రెడ్ టీషర్ట్ ధరించాడు. కింద టవల్ కట్టుకున్నాడు. హృతిక్ రోషన్ అని పేరుతో ఆ హీరో ఫొటో క్యాప్షన్ ఇచ్చాడు. తన ఫ్యాషన్ లుక్‌కు ప్రేరణ రణ్‌వీర్ సింగ్ అయ్యుంటాడని సరదాగా తన పోస్టులో రాసుకొచ్చాడు హృతిక్. తనకు సీనియర్ హీరో క్రెడిట్ ఇచ్చిన విషయం రణ్‌వీర్‌కు తెలిసిందో లేదో.. ఇప్పటివరకూ అతడు స్పందించలేదు. అయితే నెటిజన్లు ఎవరికీ అతీతులు కాదు కదా. ఫొటోపై తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
See Photos: అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!
హృతిక్ ఏంటి లంగా వేసుకున్నాడా.. లేక లుంగీలో తిరుగుతాన్నాడా అని తేల్చుకోలేక నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఫొటోను సరిగ్గా గమనిస్తే.. హృతిక్ కాలికి కట్టుతో ఉన్నాడు. కుడికాలు చీలమండ గాయం కారణంగా బ్యాండేజీ వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని హృతిక్ హీరోయిన్, ‘సూపర్ 30’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ గమనించింది. మీ కాలికి ఏమైంది అని హృతిక్ పోస్టుకు కామెంట్ చేసింది.
See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ
ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన హృతిక్ రోషన్ అని కొందరు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సంస్కారవంతమైన క్రిష్ అని మరో నెటిజన్ విచిత్రంగా కామెంట్ చేశాడు. లుంగీ కట్టావు.. దక్షిణాది సినిమాల్లో ట్రై చేసి లక్ పరీక్షించుకోవాలంటూ కొందరు నెటిజన్లు ఈ నటుడికి సలహాలు ఇస్తున్నారు.
See Pics: ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారో తెలుసా?