Rajamouli: జక్కన్న కి షాక్ ఇచ్చిన కోలీవుడ్ హీరో.. రాజమౌళి కి సైతం నో!
Rajamouli Movies: ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా.. ఎందరో నటులు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి.. క్యూ కట్టడానికి సిద్ధమవుతున్నారు. కానీ అలాంటి జక్కన్న కోరి సినిమా ఆఫర్ ఇచ్చిన కూడా.. నో చెప్పిన హీరో ఉన్నాడు అంటే మీరు నమ్మగలరా? ఒక ప్రముఖ కోలీవుడ్ స్టార్.. రాజమౌళితో… సినిమాకి నో చెప్పారు.
Rajamouli - Suriya: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో.. మొదటి స్థానంలో ఉండేది మన జక్కన్న రాజమౌళి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాతో రాజమౌళి తెలుగు ఇండస్ట్రీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశారు. అసలు రాజమౌళి పేరే.. ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా పోషించడానికి స్టార్ హీరోలు కూడా రెడీ అవుతూ ఉంటారు.
ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలి అని.. ప్రపంచవ్యాప్తంగా నటీనటులు..ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పటికీ రాజమౌళితో సినిమా చేయడం చాలామంది స్టార్లకి ఒక కల. కానీ అలాంటి రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే.. ఎవరైనా వదులుకుంటారా? ఒక కోలీవుడ్ స్టార్ వదులుకున్నారు. ఆయన మరెవరో కాదు సూర్య.
నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా.. తెరకెక్కిన సై సినిమా లో సూర్య.. కీలక పాత్ర పోషించాల్సింది. ఆ సినిమాలో రెండవ హీరో పాత్ర కోసం రాజమౌళి ముందుగా సూర్య నే సంప్రదించారట. కానీ అప్పుడప్పుడే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటున్న సూర్య ఆ సమయంలో రెండవ హీరోగా చేస్తే మళ్లీ హీరో పాత్రలు రావేమో అన్న భయంతో.. ఆ సినిమాకి నో చెప్పారట. ఆ తర్వాత శశాంక్ ఆ పాత్రలో నటించారు. సినిమా బ్లాక్ బస్టర్ కూడా అయింది.
అయితే ఇదంతా ఇప్పటి మాట కాదు. ఇదంతా జరిగి 20 ఏళ్ళు గడిచిపోయింది. సై సినిమా సమయానికి రాజమౌళి కూడా స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి వంటి రెండు బ్లాక్ బస్టర్లు ఉన్న డైరెక్టర్ మాత్రమే.. తప్ప ఇంత స్టార్ డం ఉన్న దర్శకుడు కాదు. కాబట్టి సూర్య కూడా అప్పుడు నో చెప్పగలిగారేమో. మరి ఇప్పుడు రాజమౌళి రేంజ్ కి సినిమాలో అవకాశం వస్తే.. సూర్య చేస్తారో లేదో చూడాలి.
2005 లో సూర్య గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. అప్పటినుంచి తమిళ్లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూర్యకి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం సూర్య కంగువ అనే పాన్ ఇండియా.. సినిమాతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదలకి సిద్ధం అవుతుంది. మరోవైపు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్నారు.
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook