Highest TRP Rating Movie in Telugu: ఇప్పుడు థియేటర్లో సినిమాలను చూడటాన్ని జనాలు తగ్గించేశారు. గొప్ప సినిమా, మంచి సినిమా వచ్చిందంటే తప్పా జనాలు ఇంట్లోంచి అడుగు బయటకు పెట్టడం లేదు. థియేటర్‌కు వెళ్లేందుకు ఖర్చు, ఇక థియేటర్లో పాప్ కార్న్ రేట్లు ఇలా ప్రతీ ఒక్కటి కూడా భారంగానే ఉన్నాయి. వాటికి తగ్గట్టు టికెట్ రేట్లు కూడా ఎలా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. అందుకే జనాలు ఎక్కువగా థియేటర్ మొహాన్ని చూడటం లేదు. కరోనా తరువాత థియేటర్ల మనుగడే మీదే అందరికీ అనుమానం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే టీవీ వినియోగం పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కేజీయఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా బుల్లితెరపై దారుణమైన రేటింగ్‌లను సాధించింది. బుల్లితెరపై ఏ సినిమాకు ఎంత రేటింగ్ వస్తుంది? అనేది కచ్చితంగా చెప్పలేం. థియేటర్లో ఆడని సినిమాకు బుల్లితెరపై ఆదరణ లభిస్తుంటుంది. అయితే ఇప్పటి వరకు తెలుగులో హయ్యస్ట్ రేటింగ్స్ సాధించిన చిత్రాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.


టాప్ టీఆర్పీ సాధించిన సినిమాకు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. అల వైకుంఠపురములో సినిమాను మొదటి సారి ప్రీమియర్‌గా వేసినప్పుడు 29.40 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఈ సినిమా వెండితెరపై బ్లాక్ బస్టర్ అయింది. కలెక్షన్లలోనూ టాప్‌గా నిలిచింది. అదే సమయంలో రిలీజ్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా సైతం టీఆర్పీ రేటింగ్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమాకు 23.40 రేటింగ్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు పోటీ పడ్డాయి. బుల్లితెరపైనా పోటీ పడ్డాయి.


ఇక ప్రభాస్ బాహుబలి సినిమా 22.70 రేటింగ్ సాధించింది. మహేష్‌ బాబు శ్రీమంతుడు సినిమాకు 22.54 రేటింగ్ వచ్చింది. బన్నీ పుష్ప సినిమాకు 22.50 రేటింగ్ వచ్చింది. ఇలా మహేష్‌ బాబు, అల్లు అర్జున్ సినిమాలకు టాప్ రేటింగ్స్ వచ్చాయి. టాప్ 5లో ఈ ఇద్దరి హీరోల సినిమాలే రెండేసి చొప్పున ఉన్నాయి. 


Also Read:  Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్


Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook