Why Paid Bots Star Allu Arjun Trending in Twitter: ఉరుము ఉరిమి మంగళం మీద పడిందనే సామెత ఇప్పుడు తెలుగు సినీ అభిమానులకు కరెక్ట్ గా సూట్ అవుతుందేమో. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ ఒక పెయిడ్ బోట్ స్టార్(#PaidBotsStarAlluArjun) అనే హ్యాష్ టాగ్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. అంటే అల్లు అర్జున్ తనను తాను డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటున్నాడని ఒక ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ని ఇతర హీరోల అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఎక్కువగా ఈ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేసిన ఎకౌంట్ల డీపీ(ప్రొఫైల్ పిక్స్)లు అన్ని మహేష్ బాబు ఫోటోలతో నిండిపోవడంతో మహేష్ బాబు అభిమానులు అల్లు అర్జున్ ను టార్గెట్ చేసినట్లుగా ఒక రకమైన భావన అయితే సోషల్ మీడియాలో వ్యక్తం అవుతుంది. నిజానికి అల్లు అర్జున్కి మెగా కుటుంబంతో కూడా ప్రస్తుతానికి టర్మ్స్ అంతగా బాలేదు. పైకి ఎన్ని చెబుతున్నా ఆయన మెగా క్యాంప్ కు దూరంగానే ఉన్నారని అంటున్నారు. ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జై కొట్టమన్నప్పుడు నేను జై కొట్టను బ్రదర్, చెప్పను బ్రదర్ అనే కామెంట్ చేయడంతో అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ను పెద్ద ఎత్తున టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది.


ఇటీవల రాంచరణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య కూడా చాలా దరిద్రమైన ట్విట్టర్ వార్ ఒకటి నడిచింది. కుటుంబాలలోని స్త్రీలను కూడా ఈ వివాదాల్లోకి లాగుతూ ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఆది పురుష్ టీజర్ ఏమాత్రం బాలేదనే విషయాన్ని అందరు హీరోల అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగువారి పరువు తీసేందుకే బాలీవుడ్ వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అని కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇందులో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపిస్తుండగా ఒకసారి ఆ పది తలల రావణాసురుడిగా చూపించిన గ్రాఫిక్స్ లో మహేష్ బాబు తలలు పెట్టి అల్లు అర్జున్ అభిమానులు గ్రాఫిక్స్ క్రియేట్ చేసినట్లు మహేష్ బాబు అభిమానులు భావిస్తున్నారు.


అలాగే మహేష్ బాబు అభిమానులు అల్లు అర్జున్ తలలు పెట్టి గ్రాఫిక్స్ క్రియేట్ చేసినట్లు అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఒకరి మీద ఒకరు దారుణంగా ట్రోల్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ఇతర హీరోల అభిమానులు కూడా తోడవడంతో అల్లు అర్జున్ పేరు మీద ఒక పెద్ద హ్యాష్ టాగ్ అయితే నడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ మధ్య మరీ పర్సనల్గా తమకు నచ్చని హీరోలను టార్గెట్ చేస్తున్న పరిస్థితి టాలీవుడ్ లో కనిపిస్తోంది. ఒకప్పుడు హీరో విజయ్ హీరో అజిత్ అభిమానుల మధ్య ఇదే రకమైన సోషల్ మీడియా వార్ నడుస్తూ ఉండేది.


ఇప్పుడు వాళ్లు కాస్త సంయమనం పాటిస్తున్నారు కానీ మన హీరోల అభిమానులు విషయం పెద్దది కాకపోయినా కావాలని పెద్దది చేస్తూ తమ ఉనికిని చాటుకోవడానికి తమ ప్రావల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో తమ అభిమానులను హీరోలు కనుక హెచ్చరించకపోతే కచ్చితంగా ఇది టాలీవుడ్ మొత్తాన్ని తప్పుగా ఇతర సినీ పరిశ్రమల వారికి చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి జరుగుతున్న ట్రోల్స్ మాత్రం ఆది టీజర్ లో రావణాసురుడి ముఖాలు తీసి అల్లు అర్జున్ మొఖాలు, మహేష్ బాబు మొఖాలు పెట్టడంతోనే మొదలయ్యిందని అంచనాలు ఉన్నాయి. అయితే అసలు దీని వెనుక ఏం కారణం ఉందనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.


Also Read: NY VFXWala on Adipurush: ఆ గ్రాఫిక్స్ మా పనికాదు.. మాకేం సంబంధం లేదంటూ బాలీవుడ్ హీరో సొంత సంస్థ క్లారిటీ..ఎవరు అబద్దం చెబుతున్నారు?


Also Read:Om Raut to Prabhas Room: ఓం..నా రూమ్ కి రా... టీజర్ చూసి వయలెంట్ గా మారిన ప్రభాస్.. వీడియో వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook