Sharwanand Marriage: ఎంగేజ్మెంట్ అయిన నాలుగు నెలలకు కూడా శర్వానంద్ పెళ్లి ఎందుకు అవ్వలేదు?
Sharwanand Marriage Rumors: శర్వానంద్ ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఒక అమ్మాయిని వివాహమాడేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడు, అయితే నాలుగు నెలలు పూర్తవుతున్నా ఇంకా వివాహం జరగక పోవడం చర్చనీయాంశం అవుతోంది.
Why Sharwanand Marriage Not Happening: సాధారణంగా సినిమా పరిశ్రమలోని వ్యక్తులంటేనే ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వారి పర్సనల్ లైఫ్ ల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్టులో ఒకడిగా ఉండే శర్వానంద్ ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఒక అమ్మాయిని వివాహమాడేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడు.
జనవరి 26వ తేదీన హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. రక్షితా రెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి స్వయంగా మనవరాలు అవుతుందట. అయితే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుండడంతో శర్వానంద్ పెళ్లి గురించి అప్పట్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా అయింది.
Also Read: Rashmika Mandanna Dating: బెల్లంకొండ డేటింగ్ రూమర్స్ పై రష్మిక సైలెన్స్.. ఎందుకబ్బా?
మీడియాకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండానే అప్పట్లో ఈ నిశిదార్థ వేడుక జరిగిపోయింది. అయితే ఈ నిశ్చితార్థ వేడుక జరిగి నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటికీ వీరి పెళ్లి గురించిన వార్తలు గాని, ప్రస్తావన గాని ఎక్కడా లేదు. ఇంకేముంది సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి.
కొందరైతే ఏకంగా వీరి పెళ్లి రద్దయిపోయింది అని కూడా ప్రచారం చేస్తుండగా మరికొందరు మాత్రం ఎందుకు లేట్ అయిందా? అర్థం కావడం లేదు అంటూఅనేది కామెంట్లు పెడుతున్నారు. అయితే నిజానికి వీరి పెళ్లి రద్దవ్వలేదట. శర్వానంద్ గత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతానికి పెళ్లి ముహూర్తాలు కూడా అనుకూలంగా లేకపోవడంతో కొంతకాలం పెళ్లిని వాయిదా వేశారని అంటున్నారు.
సినిమాలలో వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న శర్వానంద్ ఒకే ఒక జీవితం అనే సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 35వ సినిమా చేస్తున్నాడు. ముహూర్తాలన్నీ బావున్నాక మరో హిట్టు కొట్టిన తర్వాత ఆమెను వివాహం చేసుకోవాలని శర్వా యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అటు శర్వానంద్ గాని లేదా రక్షిత రెడ్డి కుటుంబ సభ్యులు గాని ఏదో ఒక క్లారిటీ ఇస్తే తప్ప పూర్తి అవగాహన వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Also Read: Brahmanandam Campaign: బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం.. ఎవరి కోసమో తెలిస్తే షాకవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook