Bhola Shankar Movie: ఆగస్టు 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న చిరంజీవి సినిమా భోళాశంకర్‌పై చర్చ నడుస్తోంది. చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల ఫలితం ఆ సినిమాపై పడనుందని తెలుస్తోంది. టికెట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడీ చర్చే నడుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాల్తేరు వీరయ్య వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు ఆ వ్యాఖ్యల ప్రభావం ఇప్పుడు చిరు కొత్త సినిమా భోళాశంకర్‌పై పడుతోంది. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ సినిమాకు టికెట్ల పెంపుకు ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే భోళాశంకర్ చిత్ర యూనిట్ ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. కానీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సరైన ఫార్మట్‌లో దరఖాస్తు చేయాలని ప్రభుత్వం కోరినట్టు సమాచారం. 


ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి కారణమయ్యాయి. చిరంజీవి వ్యాఖ్యల్ని ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అభివృద్ధి, పోలవరం కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకని చిరంజీవి వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. దాంతో వైసీపీ నేతలకు కోపమొచ్చింది. చిరంజీవిపై ఎదురుదాడికి దిగారు. ఈ వ్యవహారంపై చిరు, జనసేన అభిమానులు ఆందోళనకు దిగారు. చిరు అభిమానులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. 


ఓవైపు ప్రభుత్వంతో ఇంత ఘర్షణ జరుగుతుంటే సినిమా టికెట్ల పెంపుకు అనుమతి కోరడంపై చర్చ రేగుతోంది. ప్రభుత్వంతో పనులు చేయిచుకోవాలనుకున్నప్పుడు వైరం అవలంభించడం మంచిది కాదనే వాదన కూడా విన్పిస్తోంది. వాస్తవానికి టికెట్ల పెంపు అనేది ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడు విజ్ఞత ఆధారంగా తీసుకునే నిర్ణయం. ఎందుకంటే టికెట్లు ఇష్టారాజ్యంగా పెంచుకునే హక్కు నిబంధనల ప్రకారం సినిమా యూనిట్లకు లేదు. ఆయా రాష్ట్రాల్లోని నిబంధనలకు లోబడే టికెట్ ధర ఉండాలి. టికెట్ ధరకు ప్రభుత్వాన్ని అనుమతి కోరాల్సి వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అందుకే ఇప్పుడు టికెట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.


Also read;' Kushi Trailer: 'ఖుషి' ట్రైలర్‌ వచ్చేసింది.. విజయ్-సామ్ కెమెస్ట్రీ అదుర్స్...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook