Kushi Trailer: 'ఖుషి' ట్రైలర్‌ వచ్చేసింది.. విజయ్-సామ్ కెమెస్ట్రీ అదుర్స్...

Kushi Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబోలో వస్తున్న ‘ఖుషి’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లవస్టోరీగా ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2023, 05:22 PM IST
Kushi Trailer: 'ఖుషి' ట్రైలర్‌ వచ్చేసింది.. విజయ్-సామ్ కెమెస్ట్రీ అదుర్స్...

Kushi Movie Trailer: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - సమంత (Samantha) జంటగా నటించిన మూవీ 'ఖుషి'(Kushi Movie). యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళీశర్మ, జయరాం, సచిన్ ఖేడకర్, లక్ష్మీ, అలీ, రోహిణి తదితరులు కీ రోల్స్ పోషిస్తున్నారు. సామ్‌-విజయ్‌ భార్యభర్తలుగా నటిస్తున్న ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఇవాళ ఈ మూవీ ట్రైలర్ ను(Kushi Trailer) రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్లో విజయ్, సమంత మధ్య కెమెస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. లవ్, రొమాన్స్, పెళ్లి, గొడవలు, ఎమోషన్లతో ఈ మూవీ ట్రైలర్ కొనసాగింది. “'పెళ్లంటేనే చావురా.. నువ్వెప్పుడో చచ్చిపోయావు', “'అసలు భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా', 'మార్కెట్లో అలా అనుకుంటున్నారు కానీ.. నేను స్త్రీ పక్షపాతిని'.. వంటి డైలాగ్స్ తో ప్రచార చిత్రం అద్భుతంగా ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఖుషి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ నుంచి సినిమా కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News