Pan india Movies: కరోనా మహమ్మారి కారణంగా సినిమాల షూటింగ్, విడుదల ఆలస్యమవుతున్నాయి. చిన్న సినిమాలు సర్దుకుపోతున్నా..పెద్ద సినిమాలు మాత్రం వాయిదా బాట పడుతున్నాయి. ఈసారి వాయిదా పడిన ఆ సినిమాలు వేసవికి పోటీ పడేలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ ప్రభావం అన్ని రంగాలపై పడింది. కరోనా మొదటి వేవ్ నుంచి అదే పరిస్థితి. ఫస్ట్‌వేవ్ తగ్గిన తరువాత..ముఖ్యంగా చిన్న సినిమాలు సందడి చేశాయి. సినీ పరిశ్రమ తిరిగి కోలుకుంటుందనుకునేలోగా కరోనా సెకండ్ వేవ్ గట్టి దెబ్బ కొట్టింది. మరోసారి థియేటర్లు మూతపడ్డాయి. కరోనా సెకండ్ వేవ్ అదుపులో వచ్చాక..తిరిగి బాక్సాఫీసు పరుగులు పెట్టింది. దసరా నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, అఖండ, పుష్ప, బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. అంతా బాగుందనుకుని భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలుగా వస్తున్న రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో (RRR Movie) పాటు సర్కారు వారి పాట, ఆచార్య కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా థర్డ్‌వేవ్ మరోసారి దెబ్బేసింది. ఆర్ఆర్ఆర్, సహా అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి.


కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave)తగ్గిన తరువాత అంటే మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28న రాధేశ్యామ్ (Radheshyam) విడుదల కావచ్చని తెలుస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చ్ 18 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు దర్శక నిర్మాతలు. ఏప్రిల్ 1న మాత్రం సర్కారువారి పాట, ఆచార్య విడుదల కానున్నాయి. ఈ క్రమంలో మార్చ్ 18న ప్రభాస్ వర్సెస్ రాజమౌళి పోటీ తప్పేట్టు లేదు. 


Also read: Sarkaru vaari paata: అభిమానుల్ని ఆకట్టుకుంటున్న సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ ట్యూన్, తమన్ చింపేశాడుగా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook