పవన్ కళ్యాణ్ నటించిన 'గుడుంబా శంకర్' చిత్రం గుర్తుందా...? ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన వీరశంకర్ చాలా రోజుల తర్వాత మరో ప్రయోగాత్మకమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ  చిత్రానికి 'మనసంతా నువ్వే' సినిమా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించడం విశేషం. "అలా నేను.. ఇలా నువ్వు" పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే తొలి హోం థియేటర్ చిత్రంగా పేర్కొ్న్నారు నిర్మాత. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని సమర్పించగా.. ఆ చిత్రం లోగోని రిపబ్లిడ్ డే సందర్భంగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం వాల్టేరు క్లబ్‌లో ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హోం థియేటర్స్ ఓనర్స్ కోసం అందించబోయే తొలి చిత్రం ఇదే అని.. నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని  నిర్మాత తెలిపారు.