Yash 19 Update రాకీ భాయ్‌గా నేషనల్ వైడ్‌ ఇమేజ్ తెచ్చుకున్నాడు యష్. అయితే కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా యష్ తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనేలేదు. అసలు ఏ దర్శకుడితో చేయబోతోన్నాడనే విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఎవరితో చేయాలనుకుంటున్నాడు.. యష్‌తో చేసేందుకు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ దర్శకులు రెడీగా ఉన్నారని తెలిసిందే. అయితే ఆ మధ్య కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. శంకర్‌ దర్శకత్వంలో యష్ నటిస్తాడని రూమర్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యష్ బర్త్ డే (జనవరి 8) సందర్భంగా అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు. ఈ సారి బర్త్ డే స్పెషల్‌గా కొత్త సినిమా అప్డేట్ ఉంటుందని అభిమానులంతా కూడా భావించారు. అయితే వారి ఆశలపై యష్ నీళ్లు చల్లాడు. తాజాగా యష్ చేసిన ఓ పోస్ట్‌తో అప్డేట్ మీద క్లారిటీ వచ్చింది. అసలు తాను ఈ బర్త్ డేకు ఇంట్లో ఉండటం లేదని, ఎవ్వరూ కూడా తన ఇంటి వద్దకు రాకండని వేడుకున్నాడు యష్.


 



ఇక సినిమా అప్డేట్ రాలేకపోవచ్చని, ఇంకా పనులు జరుగుతున్నాయని, ఇంకాస్త టైం పడుతుందని, మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. దానికి తగ్గట్టుగానే ఆ అప్డేట్ ఉంటుందని యష్ హామీ ఇచ్చాడు. ప్రత్యేకంగా ఆ చిత్రం ఉంటుందని, అయినా ఈ సారి తాను అభిమానులను కలిస్తే కచ్చితంగా అప్డేట్ చెప్పాలని ఫిక్స్ అయినట్టుగా యష్ తెలిపాడు.


అభిమానులే తనకు ప్రపంచం అని, వారి ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయికి వచ్చానని యష్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం యష్ నుంచి ఎలాంటి అప్డేట్ రాదని అందరికీ అర్థమైంది. పైగా బర్త్ డే నాడు.. యష్‌ను చూసే చాన్స్ కూడా ఉండదని తెలిసి వచ్చింది. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.


Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట


Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి