Yash, SanjayDutt's KGF Chapter 2 reaches 1m interests in Book My Show APP: కన్నడ స్టార్ హీరో 'యష్' ప్రధాన పాత్రలో నటించిన 'కేజీఎఫ్' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'కేజీయఫ్‌ చాప్టర్‌ 2'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ శాండల్‌వుడ్ చిత్రం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేజీయఫ్‌ చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ మొదలెట్టింది. సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ మంచి టాక్ తెచ్చుకున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఆసక్తి ఎంతన్న సంఖ్యను ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్.. 'బుక్ మై షో' తెలిపింది. కేజీయఫ్‌ చాప్టర్‌ 2 సినిమా ఒక మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించిందట. ఈ యాప్ కేవలం సినిమా టిక్కెట్లను బుక్ చేయడమే కాకుండా.. ఒక్కో సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారనే సంఖ్యను కూడా చెబుతోంది. 


'బుక్ మై షో' తెలిపిన గణాంకాల ప్రకారం.. కేజీయఫ్‌ చాప్టర్‌ 2 సినిమా విడుదలపై అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తోంది. సినిమాకు ఇంకా వారంకు పైగా సమయం ఉండడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు సంఖ్యలో వ్యూస్ సాధిస్తోంది. ఇక రవి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 


ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్ 2' సినిమాని హోంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఏప్రిల్ 14న అన్ని భాషల్లో గ్రాండ్‌గా విడుదల అవ్వనుంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్.. టాలీవుడ్ సీనియర్లు ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లతో నటీనటులు బిజీగా ఉన్నారు. 


Also Read: Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే.. నేను చేసుకుంటా! హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్


Also Read: Governor Tamilisai: నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది: గవర్నర్ తమిళిసై


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook