KGF‌2 Advance Bookings Collection: కన్నడ రాకింగ్ స్టార్  యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కేజీఎఫ్‌ ఛాప్టర్‌2.  2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో హిరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లతోపాటు ప్రకాష్‌రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగెస్ట్ ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి ఎడిట్ చేసిన ఈ మూవీకి భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని డబ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌పై ఈ సినిమా విడుదలైంది. భారత్‌లో 6వేలు, దక్షిణాదిలో 2600 థియేటర్లలో విడుదల చేశారు.
దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 సుదీర్ఘ కాలంపాటు వెయిట్ చేయించిన అనంతరం ఏప్రిల్ 14న విడుదలైంది. ఈ మూవీ ఏపీ, తెలంగాణ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50 కోట్లకు కొనుగోలు చేశారు. మూవీ శాటిలైట్ హక్కులు సైతం ప్రముఖ ఛానెల్ రూ.30కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేజీఎఫ్2 ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు:
నైజాం- Rs 25 crore
సీడెడ్- Rs 14.03 crore
ఉత్తరాంధ్ర: Rs 9.7 crores
ఈస్ట్ గోదావరి : EG: Rs 7.2 crores
పశ్చిమ గోదావరి : Rs 6 crores
గుంటూరు : Rs 7 crores
కృష్ణా : Rs 5.5 crore
నెల్లూరు : Rs 2.75 crores


ఇక కేజీఎఫ్‌2 తెలుగు వెర్షన్‌ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 11.16కోట్లు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. విజయ్ బీస్ట్ సినిమాతో పోలిస్తే ఈ మొత్తం రెండింతలుగా ఉంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపుతో ఈ మూవీ వసూళ్లు మెరుగ్గా ఉండనున్నాయి. బాహుబలి 2 సాధించిన వసూళ్లను రీచ్ అవుతుందా లేదా అనేది మంగళ, బుధ వారం వసూళ్లను బట్టి డిసైడ్ కానుంది.


Also Read: KGF Chapter 2 OTT Release Date: అభిమానులకు గుడ్ న్యూస్.. 'కేజీయఫ్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!


Also Read: RR vs GT: రాజస్తాన్‌తో గుజరాత్‌ ఢీ.. టేబుల్ టాపర్‌ను హార్దిక్ టీమ్ ఓడిస్తుందా?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook