IPL 2022, RR vs GT 24th Match Preview: ఐపీఎల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లైతే చివరివరకు కూడా ఉత్కంఠగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై వేదికగా రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ఆరంభంకానుంది.
ఐపీఎల్ 2022లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. రాజస్థాన్ ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విజయం సాధించింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో మాత్రం రాజస్థాన్ ఓటమిపాలైంది. అటు గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదుచేసి.. నాలుగో మ్యాచ్ లో ఓడిపోయింది. సన్ రైజన్స్ చేతిలో హార్ధిక్ పాండ్యా సేన పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లాలని గుజరాత్.. టాప్ ప్లేస్ ను కాపాడుకోవడం కోసం రాజస్థాన్ జట్లు పోటీపడుతున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నరకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, శిమ్రాన్ హెట్‌మెయిర్, జొస్ బట్లర్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. బట్లర్, హెట్‌మెయిర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే పరుగుల వరదే. శాంసన్, పడిక్కల్, జైస్వాల్ లాంటి స్వదేశీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. చహల్, అశ్విన్, బౌల్ట్, ప్రసిద్, సైనీ లాంటివో టాప్ స్టార్లు ఉన్నారు. ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు (11) తీసిన బౌలర్ల జాబితాలో చహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. పటిష్టంగా ఉన్న రాయల్స్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే టైటాన్స్ బ్యాటర్లు కష్టపడాల్సిందే.
తుది జట్లు (అంచనా)
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్.
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, ఆర్ సాయి కిషోర్
Also Read:Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్.. రోహిత్ శర్మపై వేటు..?
Also Read:Gold Rate Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. రూ.3,900 పెరిగిన బంగారం ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook