Rajamouli Upcoming Movies: తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి.. పరిచయం చేసింది రాజమౌళి అనడంలో అతిశయోక్తి లేదు. అప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలకి.. మాత్రమే పరిమితమైన తెలుగు సినీ ఇండస్ట్రీ.. గురించి భారతదేశం మాత్రమే కాకుండా.. ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది.. రాజమౌళి తీసిన బాహుబలి సినిమా. బాహుబలి సినిమాతోనే ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాల హవా.. మొదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు దాదాపు స్టార్ హీరోలు.. అందరూ భారీ బడ్జెట్ సినిమాల మీదే ఉన్నారు. రాజమౌళి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో.. ఇప్పటికే తెలుగులో బోలెడు భారీ బడ్జెట్ సినిమాలు.. విడుదలయ్యాయి. బ్లాక్ బస్టర్లు కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా స్టాండర్డ్స్.. బాగా పెరిగిపోయాయి. 


అప్పటిదాకా విజువల్స్ అంటే మగధీర, ఈగ, బాహుబలి వంటి సినిమాలు గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్లు.. వాటిని తలదన్నేలా సినిమాలు తీస్తున్నారు. పెరిగిపోతున్న టెక్నాలజీతో.. అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు రాజమౌళి కూడా అప్డేట్ అవ్వాల్సిన.. సమయం వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్లు తమ భారీ బడ్జెట్ సినిమాలతో.. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఉదాహరణకి ప్రశాంత్ వర్మ హను మ్యాన్.. సినిమాతో తెలుగు ఇండస్ట్రీని మరొక మెట్టు పైకి ఎక్కించారు. తక్కువ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో.. సినిమా తీసి..ప్రశాంత్ వర్మ అందరికీ షాక్ ఇచ్చారు. 


ఇక నిన్న గాక మన విడుదలైన కల్కి 2898 ఏడి సినిమాతో.. నాగ్ అశ్విన్ అదిరిపోయే విజువల్స్.. చాలా తక్కువ సమయంలో.. తక్కువ బడ్జెట్ కి అందించారు. సినిమాలోని.. ఈ విజువల్స్ గురించి ఇప్పటికీ ప్రేక్షకులు.. మాట్లాడుతూనే ఉన్నారు. ఇంత తక్కువ బడ్జెట్ లో.. అంత క్వాలిటీ సినిమా.. తీయడం మామూలు విషయం కాదని, పైగా తక్కువ సమయంలో.. ఇంత మంచి అవుట్ పుట్ తీసుకురావడం నాగ్ అశ్విన్  కి.. మాత్రమే సాధ్యమైంది అని అంటున్నారు.


ఇలా రోజు రోజుకి పెరిగిపోతున్న టాలీవుడ్ సినిమాల రేంజ్  ..రాజమౌళి మీద ప్రెషర్ మరింతగా పెరిగేలా చేస్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ఉండబోతుంది.. అని ఇప్పటికే చాలామంది చెబుతున్నారు. 


ప్రస్తుతం వస్తున్న సినిమాల కంటే.. ఎక్కువగా రాజమౌళి మహేష్ బాబు సినిమా మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈమధ్య విడుదలై హిట్ అయిన సినిమాలు.. కంటే కొత్తగా అదిరిపోయే విజువల్స్ రాజమౌళి అందించాల్సి ఉంటుంది. మరి పెరిగిపోతున్న అంచనాలను రాజమౌళి అందుకోగలరా లేదా.. వేచి చూడాలి.


Also Read: YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్‌ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?


Also Read: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి