Raj Tarun Lavanya: తెలుగు సినీ నటుడు రాజ్ తరుణ్‌పై ఓ యువతి సంచలన ఆరోపణలు చేశారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనను రాజ్‌ తరుణ్‌ వదిలివేయడానికి కారణం ఓ సినీ నటి అని చెప్పడం తెలుగు సినీ పరిశ్రమలో కలపలం రేపింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓజీపై అప్‌డేట్‌ ఇచ్చిన పవన్‌ కల్యాణ్


 


యువ హీరో రాజ్‌ తరుణ్‌ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య అనే యువతి శుక్రవారం హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రంలో రాజ్‌ తరుణ్‌ చేసిన మోసాలంటూ లిఖితపూర్వకంగా వివరించారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాజ్‌ తరుణ్‌ వదిలేసి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము విడిపోవడానికి ఓ సినీ నటే కారణమని.. ఆ సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. రాజ్‌ తరుణ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో వివరించారు.

Also Read: Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?


లావణ్య వాదన ఇలా..
'పదకొండేళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. మేమిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌తో రాజ్‌ తరుణ్‌ సంబంధం పెట్టుకొని నన్ను వదిలేశాడు. మూడు నెలల కిందట రాజ్ తరుణ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు. అతడిని వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారు. రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం.. నాకు అతడు కావాలి. నాకు న్యాయం చేయాలి' అని లావణ్య వాపోయారు.


ఈ సంద్భంగా గతంలో రాజ్‌ తరుణ్‌ఫై డ్రగ్స్‌ ఆరోపణలు వచ్చిన విషయమై కూడా లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గతంలో రాజ్‌ తరుణ్‌ను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారు. అరెస్టయి 45 రోజులు జైల్లో ఉన్నా. ఆ సమయంలో రాజ్‌ తనకెలాంటి సాయం చేయలేదు' అని లావణ్య చెబుతున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇంకా నమోదు చేయలేదు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter