Jr NTR 39th Birthday: తారక్... అభిమానులకు ఆయన పేరొక వైబ్రేషన్... వెండితెరపై ఆయన నటనొక సెన్సేషన్... కేవలం 19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ డమ్‌ను రుచి చూశాడు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతోనూ సతమతమయ్యాడు... సినీ కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఉత్తానపతనాలను చవిచూశాడు... ఆది బ్లాక్ బ్లస్టర్‌తో మొదలైన ఎన్టీఆర్ స్టార్‌డమ్ ఇటీవలి ఆర్ఆర్ఆర్‌తో మరింత పీక్స్‌కి చేరింది. ఇటీవలి ఓ సర్వేలో 2022 సంవత్సరానికి గాను టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోగా ఎన్టీఆర్ నిలవడమే ఇందుకు నిదర్శనం. ఇవాళ్టితో ఎన్టీఆర్ 39వ వడిలోకి అడుగుపెట్టబోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీఆర్ 1991లో వచ్చిన బ్రహ్మర్శి విశ్వామిత్ర సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికీ ఎన్టీఆర్ వయసు ఎనిమిదేళ్లు. ఆ తర్వాత 1996లో బాల రామాయణం అనే మరో సినిమాలోనూ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. నిన్ను చూడాలని సినిమాతో 18 ఏళ్ల వయసులో 2001లో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో మొదటి హిట్ కొట్టాడు. 


2002లో వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆది' సినిమా ఎన్టీఆర్‌కు స్టార్ డమ్ తీసుకొచ్చింది. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులు వెంటాడాయి. ఆ తరుణంలో సింహాద్రితో ఎన్టీఆర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినట్లే కనిపించాడు. కానీ మళ్లీ ఫ్లాపులు పలకరించాయి. దాదాపు అరడజను సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మళ్లీ రాజమౌళితో చేతులు కలపడంతో 2007లో యమదొంగతో ఎన్టీఆర్ గట్టి హిట్ కొట్టాడు.


ఆ తర్వాత కంత్రీ, శక్తి లాంటి డిజాస్టర్స్ పడినప్పటికీ... బృందావనం, అదుర్స్, బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత సినిమాలతో హిట్స్ కొట్టాడు. ఇటీవలి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను సెట్ చేయడమే కాదు.. కొమురం భీముడో పాటలో తన నటనాచాతుర్యంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. పుట్టిన రోజు సందర్భంగా కొరటాల శివతో తన 30వ సినిమాను అనౌన్స్ చేశాడు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌కు జీ తెలుగు న్యూస్ తరుపున హ్యాపీ బర్త్ డే...!


Also Read: Nallala Odelu Joins Congress: కాంగ్రెస్‌ గూటికి నల్లాల ఓదెలు.. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిక.. ఇక బాల్క సుమన్‌తో 'ఢీ'..! 


Also Read:  Jeevitha Rajasekhar Apology: ఆర్యవైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ...   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.